Mirror Direction: డబ్బు సంపాదించేందుకు చాలా కష్టపడుతున్నారు. ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ నిలవడం లేదు. కొందరికి మాత్రం పట్టిందల్లా బంగారమే అవుతుంది. తమకెందుకు ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధపడుతుంటారు. ఎంత డబ్బు సంపాదించినా ఎందుకు నిలవడం లేదని విచారం వ్యక్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వాస్తు పద్ధతులు సరిగా పాటిస్తే డబ్బు నిలుస్తుందని దానికి ఏం చేయాలో ఆలోచనలో పడుతుంటారు.
షెంగ్ షుయ్ వాస్తు ప్రకారం ఇంటికి వాస్తు పద్ధతులు పాటించాలి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఇది దోహదపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చు. డబ్బు సంపాదించాలంటే ఒక అద్దాన్ని డైనింగ్ టేబుల్ ఎదురుగా పెట్టాలి. అద్దంలో డైనింగ్ టేబుల్, దానిపై ఉండే ఆహారాలు మనకు కనిపించాలి. దీంతో అలా అద్దం ఉంచుకోవడం వల్ల మన ఆర్థిక ఇబ్బందులు దూరమై పాజిటివ్ ఎనర్జీ కలిగేందుకు అవకాశం ఉంది.
మనం ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్ లో ఏదైనా ఒక ప్రదేశంలో బాగా కనిపించేలా అద్దం పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మనం ఇంట్లోకి అడుగుపెట్టగానే అద్దం కనిపించకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా ఒక దిక్కులో అద్దం ఉంచుకుంటే సరి. మనకు నెగెటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. దీంతో డబ్బు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
అద్దం ఎక్కడ పెట్టినా అందులో చెత్త మాత్రం కనిపిస్తే మనకు అరిష్టమే. బెడ్ రూంలో బెడ్ కు ఎదురుగా అద్దం ఉంచితే దుష్ర్పభావాలు వస్తాయి. అద్దం ఇంట్లో అమర్చుకోవడం వల్ల మనకు నెగెటివ్ పోయి పాజిటివ్ వచ్చేలా చూసుకోవాలి. దీంతో మన పాజిటివ్ ఎనర్జీ పెరిగి అన్ని విషయాల్లో కలిసి వస్తే ధనవంతులం కావడం పెద్ద కష్టమేమీ కాదు.