Largest animal in the World: ఈ భూమి మీద ఎన్నో రకాల జీవరాసులు నివసిస్తూ ఉన్నాయి. వీటిలో అన్నిటి గురించి మనుషులకు తెలియకపోవచ్చు. మనకు తెలియని ఎన్నో రకాల జీవరాసులు ఈ భూమి మీద ఉన్నాయి. అయితే కొందరు శాస్త్రవేత్తలు వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా బయటపడిన అతిపెద్ద జీవి నీలి తిమింగలం (Blue Whale). ఇది ఎంత పెద్దది అంటే దాని పక్కన ఒక మనిషి నిలబడితే.. మనిషి చిన్న బొమ్మలాగా కనిపిస్తాడు. అయితే బ్లూ వాలే కేవలం జంతువు మాత్రమే కాదు సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఒక కీలకమైన భాగంగా పేర్కొంటారు. దానికి సముద్ర లోతులో ఉన్న జీవ వైవిధ్యం గురించి పూర్తిగా తెలుసు. ఈ సమాచారాన్ని మనకు ఇవి అందిస్తాయి అంటే ఎవరు నమ్మరు. మరి ఈ నీలి తిమింగాల గురించి పూర్తిగా తెలుసుకుందామా..?
ప్రపంచంలోనే అతిపెద్ద జంతువుగా పేర్కొనే బ్లూ వాలే పొడవు 29.9 మీటర్లు. అంటే 98 అడుగులు అన్నమాట. కొన్ని 30 మీటర్ల కంటే ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంది. దీని బరువు 173 టన్నులు. అంటే 30 ఏనుగులు కలిస్తే ఎంత బరువు ఉంటుందో అంతా బరువు నీలి తిమింగలం ఉంటుందన్నమాట. మనుషుల వలె ఈ జంతువుకు గుండె ఉంటుంది. ఈ గుండె మనం ప్రయాణించే కారు అంత సైజు ఉంటుంది. మామూలుగానే తిమింగలం అంటే మనం భయపడిపోతుంటాం. అలాగే తిమింగలం చిన్నచిన్న చేపలను తింటూ తమ ఆకలిని తీర్చుకుంటాయి. ఈ నీలి తిమింగలం మాత్రం కష్టేషియన్లను తింటూ బతుకుతుంది. అంతేకాకుండా అతిపెద్ద శబ్దం చేయగల జంతువు కూడా ఇదే. ఇది ఒక్కసారి అరిస్తే జెట్ ఇంజన్ కంటే కూడా బిగ్గరగా ఉంటుంది. అంటే ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు వెళ్తుంది.
ఈ జంతువులు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాయి. వీటికి కమ్యూనికేషన్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇవి ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలని అనుకుంటే వందల మహిళ దూరం ప్రయాణిస్తాయి. ప్రపంచంలో అంతరిస్తున్న జాతులలో నీలి తిమింగలాలు కూడా ఉన్నాయి. వీటిని చాలామంది వేటాడడం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతున్నాయి. అయితే 1966 నుంచి వీటికి రక్షణ కల్పిస్తున్నారు. అయినా కూడా నీటి కాలుష్యం, నౌకల తాకిడి తోపాటు మత్స్యకారుల వలలో చిక్కుకోవడం వల్ల అంతరించిపోతున్నాయి.
అయితే బ్లూ వాలే శరీరం అంత పెద్దదిగా మారడానికి కారణమేంటని పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్ గా చేసిన పరిశోధనల ప్రకారం నీటి తిమింగలాలు ఎక్కువగా ఆహారాన్ని తీసుకొని తక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. దీంతో వాటిలో ఉండే ఆహారం తో వాటి శరీరం కూడా పెరిగిపోయింది. మూడు కోట్ల సంవత్సరాల కింద బ్లూ వాలేలు ఎక్కువగా ఉండేవి. కానీ మంచి యుగం తర్వాత వాటి సంఖ్య తగ్గుతూ వస్తుంది. కొందరు .. వాటితో ఆహారాన్ని,బెల్టులు తయారు చేయడం కోసం వేటాడే వారు. దీంతో వాటి సంఖ్య తగ్గుతూ వస్తుంది.