
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పాడు. మనకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చెబుతాడు. ఆయన సూచించిన దాని ప్రకారం ఇప్పటికి కూడా అవే విషయాలు మనకు పనికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాణక్యుడు మన జీవితంలో ఎలాంటి వారితో స్నేహం చేస్తే ఏమవుతుంది? అనే విషయాలు కూలంకషంగా వివరించాడు. చెడు వారితో స్నేహం చేస్తే మనకు కూడా ఇబ్బందులు రావడం ఖాయం. అందుకే వారితో స్నేహం అంత మంచిది కాదనేది ఆయన సూచన.
అహంకారం
కొందరిలో అహంకారం బాగా ఉంటుంది. అలాంటి వారితో స్నేహం చేయడం మంచిది. ఎందుకంటే అతడు మనకు లభించే విజయాలను పట్టించుకోడు. పైగా చులకన చేస్తాడు. అహంకారంతో ఉన్న వ్యక్తి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కానీ తన మనసు మార్చుకోడు. దీని వల్ల జీవితంలో ఎన్నోకోల్పోతాడు. అలాంటి వారితో స్నేహం చేయడం అంత మంచిది కాదు.
ఆడాళ్ల వెంట..
ఆడాళ్ల వెంట పడేవాడితో జాగ్రత్తగా ఉండాలి. వారితో స్నేహం చేయకూడదు. ఎందుకంటే వారు ఎప్పుడు ఎవరితో పడితే వారి వెంట పడితే దేహశుద్ధి జరగడం ఖాయం. అలాంటి వాడితో మనకు స్నేహం ఉంటే మనకు కూడా సమస్యలే వస్తాయి. ఈ నేపథ్యంలో చాణక్యుడు సూచించిన ప్రకారం వీరితో స్నేహం చేయడం అంత సులభం కాదు.
మోసాలు చేసేవాడు
ఇతరులను మోసం చేసే వాడితో స్నేహం చేయడం సరైంది కాదు. అలాంటి వారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వాడికి దగ్గర ఉండకూడదు. మోసం చేసే వాళ్లకు తర తమ భేదాలుండవు. ఎవరినైనా సులభంగా మోసం చేస్తుంటారు. వారిని నమ్మితే మనమే మోస పోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
అత్యాశ ఉన్నవారు
దురాశ దుఖానికి చేటు అంటారు. స్వార్థపరులైన వారికి అత్యాశ ఉంటుంది. వారితో జాగ్రత్తగా ఉండాలి. వారు తమకు నచ్చినది దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. వీరితో స్నేహం చేయకపోవడమే మేలు. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు అని ఓ సినిమాలోని మాట ప్రస్తావనార్హం. దీంతో దురాశతో ఉన్న వాడితో స్నేహం చేయడం మానుకోవడమే సురక్షితం.