
Kidneys Health: ఇటీవల కాలంలో కిడ్నీలు చాలా మందికి చెడిపోతున్నాయి. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. డయాలసిస్ మీదే ఆధారపడి బతకాల్సిన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డయాలసిస్ బాధితుల సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. కిడ్నీలు పాడైపోతే బతుకే నరకంగా మారుతుంది. మన శరీరంలో ఉన్న ఐదు లీటర్ల రక్తాన్ని ప్రతి గంటకోసారి ఫిల్టర్ చేసే కిడ్నీలు పనిచేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. డయాలసిస్ అంటే వారానికి కనీసం రెండు సార్లు చేసుకోవాలి. ఇలా ప్రతి వారం చేయించుకుంటేనే బాగుంటుంది. లేకపోతే అంతే సంగతి. ప్రాణాలు పోవడం గ్యారంటీయే.
Also Read: Trivikram -Devi Sri Prasad: త్రివిక్రమ్ – దేవిశ్రీప్రసాద్ మధ్య ఇన్ని గొడవలు జరిగాయా..! కారణం అదేనా?
మూత్రపిండాలు ఎందుకు చెడిపోతాయి?
ప్రస్తుత కాలంలో మూత్రపిండాల సమస్య గండంగా మారుతోంది. కిడ్నీలు ఎందుకు పాడవుతాయి. మన ఆహారపు అలవాట్లతో మనకు చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దీర్ఘకాలంగా ఉండే ఈ వ్యాధులతో మన శరీర భాగాలు పాడైపోవడం సహజమే. ఈ వ్యాధులు ఉన్న వారిలో చాలా మందికి కిడ్నీల సమస్య రావడం చూస్తుంటాం. ఒకవేళ బీపీ, షుగర్ ఉంటే వాటిని నిరంతరం నియంత్రణలో ఉంచుకుంటూ వాకింగ్ లాంటివి చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మూత్రపిండాలు దెబ్బతినడం కామనే.
ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ప్రస్తుతం ఆయుర్వేదంలో మంచి చికిత్స మార్గాలున్నాయి. కిడ్నీలు చెడిపోతే ఆయుర్వేద మందులు వాడితే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు చెడిపోయిన వారు తగిన చికిత్స తీసుకుంటే మళ్లీ పూర్వ స్థితికి వస్తాయి అంటున్నారు. కానీ కొంత రిస్క్ చేయక తప్పదు. రోగం వచ్చినాక ఇక తప్పించుకోవడం కుదరదు. రోగం నయం కావాలంటే ఏదో ఓ చికిత్సకు మనం సిద్ధం కావాల్సిందే. ఈ క్రమంలో ఆయుర్వేద వైద్యంతో మనకు ఎన్నో రకాల లాభాలు కనిపిస్తున్నాయి.

ఏం చేయాలి?
ఒకసారి కిడ్నీలు చెడిపోయాయంటే ఇక బాగు చేసుకోవడానికి వీలుండదు. సమస్య తీవ్రత పెరగకుండా చేసుకోవడమే మార్గం. కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవడమే మన చేతుల్లో ఉంటుంది. పాడు అయిన తరువాత ఇక చేసేది ఏముండదు. అందుకే కిడ్నీలను బాగా చూసుకోవడం మన విధి. సాధ్యమైనంత వరకు తగినన్ని నీళ్లు తాగుతుండాలి. బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవాలి. గుండె జబ్బులు వంటివి కూడా వచ్చే అవకాశమున్నందున మధుమేహులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవు.
Also Read:Gang Leader Re Release: ‘గ్యాంగ్ లీడర్’ రీ రిలీజ్ 3 రోజుల వసూళ్లు..ఇంత తక్కువ వసూళ్లను ఊహించలేదు!