
Holi 2023 : అరచేతిలో ఇమిడే ఫోన్ లో మన సమస్తం ఉన్నాయి. మాటల నుంచి బ్యాంకింగ్ దాకా.. వాట్సాప్ నుంచి చాట్ పీజీటీ దాకా.. ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ అనేది మన జీవితం లో ఒక భాగం అయింది. అలాంటి ఫోన్ కు ఏదయినా అయితే.. ఇంకేమైనా ఉందా? హోలీ… అంటేనే రంగుల రంగేళీ.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఉత్సాహం లో మునిగి తేలే పండగ ఇది. రంగులు పూసుకోవడం, నీళ్ళు చల్లుకోవడం ఈ పండుగ లో పరిపాటి.. ఇలాంటప్పుడు ఫోన్, ఇతర గాడ్జెట్‌లపై జాగ్రత్తలు పాటించాలి. హోళీ వేడుకల్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఏవైనా పాడయినా.. ఏ కంపెనీ ఎలాంటి వారంటీ ఇవ్వదు. వేడుకల్లో భాగంగా ఒకవేళ పొరబాటున ఫోన్ నీటిలో పడితే లేదా తడిగా ఉంటే, ఈ సాధారణ చిట్కాలు మీ ఫోన్‌ను రక్షించడంలో సహాయ పడతాయి.
ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి
ఫోన్ నీళ్లల్లో పడ్డా లేదా నీటి చెమ్మ తగిలినా వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లో చార్జింగ్ పెట్టకండి. చార్జింగ్ పెట్టిన వెంటనే ఫోన్ ఆన్ చేసేందుకు ప్రయత్నించకండి. ఎందుకంటే అది షార్ట్ సర్క్యూట్ కు దారితీయవచ్చు. కొంతమంది ఎలాగూ ఫోన్ ఆన్ అయింది కాబట్టి అందులో యాప్స్ ఓపెన్ చేసి వాడుతుంటారు. ఇది సరయిన పద్ధతి కాదు. ఫోన్ తడిచిన వెంటనే దాన్ని కవర్ లేదా ప్రొటెక్టివ్ పౌచ్ కూడా తీసేయండి. దీనివల్ల కవర్ లో ఉన్న నీరు, ప్రొటెక్టివ్ పౌచ్ కు ఉన్న తేమ ఫోన్ లోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఇలా చేయని పక్షంలో కవర్ లో ఉన్న నీరు, తేమ ఫోన్ లోకి వెళ్ళి దానిని పని చేయకుండా చేస్తుంది. కవర్, పౌచ్ ను తొలగించిన తర్వాత ఫోన్ ను శుభ్రంగా తుడవండి.. తుడిచే క్రమంలో ఫోన్ ను గట్టిగా రుద్దకండి. దీనివల్ల నీరు లేదా తేమ పొరపాటున ఫోన్ సున్నితమైన భాగాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చార్జింగ్ ఫోర్ట్, సిమ్, మైక్రో ఎస్డీ లో నీరు లేదా తేమ వెళ్ళకుండా చూసుకోవాలి.
ఆపిల్ ఫోన్ కనుక మీరు వాడుతున్నట్టయితే..
ఆపిల్ ఫోన్ కనుక మీరు వాడుతున్నట్టయితే అందులో ఉన్న సపోర్ట్ సిస్టం ఫోన్ ను ఆరబెట్టాలని సూచిస్తుంది. ఫోన్ లో ఉన్న కనెక్టర్ ను సున్నితంగా నొక్కితే నీరు బయటకి వెళ్ళిపోతుంది. నీరు మొత్తం బయటకి వెళ్ళింది అనుకున్నాకే దాన్ని ఛార్జ్ చేయాలి. లేకుంటే ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఆపిల్ ఫోన్ ఆరిన 5 గంటల తర్వాతే చార్జింగ్ పెట్టాలి. మరో వైపు ఫోన్ ను తుడిచిన తర్వాత అదే పని గా కదిలించ కూడదు. చాలా మంది ఫోన్ తేమ ను తొలగించేందుకు హెయిర్ డ్రైయర్ ను వాడతారు. దీనివల్ల ఫోన్ లోపలి ఎలక్ట్రాన్స్ భాగాలు దెబ్బతింటాయి. ఇలాంటప్పుడు ఫోన్ ను ఒక అన్నం గిన్నెలో ఉంచవచ్చు. అది ఫోన్ లో తేమను గ్రహిస్తుంది. లేదా బియ్యం సంచి లో ఉంచినా ఉపయుక్తంగా ఉంటుంది. బియ్యం తేమను గ్రహిస్తాయి. అందులో పెట్టే ముందు ఫోన్ ను ఓ కవర్ తో చుట్టి 20-24 గంటల వరకు ఉంచితే ప్రయోజనం ఉంటుంది. ఇలాంటప్పుడు ఫోన్లోకి బియ్యం, దుమ్ము, ధూళి వెళ్లకుండా చూసుకోండి. వీలు ఉంటే సిలికాన్ జెల్ ప్యాకెట్లనలో ఫోన్ ను చుట్టి బియ్యం లేదా అన్నం గిన్నెలో ఉంచండి. అవి నీటిని తొలగించేందుకు ఉపయోగపడతాయి..ఇలా రెండు నుంచి నాలుగు రోజులు చేసిన తర్వాత మీ ఫోన్ ను ఆన్ చేయండి. ఇవన్నీ చేసినా ప్రయోజనం లేకపోతే సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లండి.