Online Gaming Addiction: కరోనా కాలంలో పిల్లలకు ఫోన్లు ఇచ్చారు. దీంతో వారు ఆన్ లైన్ గేములకు అలవాటు పడ్డారు. ఫోన్ దొరికిందంటే చాలు గంటల తరబడి ఫోన్లతో కాలక్షేపం చేయడం అలవాటుగా మారింది. పిల్లలకు ఫోన్లు అసలు ఇవ్వకూడదు. ఫోన్లతో సమయాన్ని గడుపుకుంటూ చాలా మంది పిల్లలు సమయాన్ని వృథా చేస్తున్నారు. ఫలితంగా చదువుపై ప్రభావం పడుతోంది. అస్తమానం ఇంటర్నెట్ లో గడపడం వల్ల శారీరక వ్యాయామం జరగడం లేదు. దీంతో పిల్లల భవిష్యత్ కు ఆటంకంగా మారుతోంది. తల్లిదండ్రులు పిల్లల వ్యవహారంపై దృష్టి సారించి వారి ఆటలను గమనిస్తూ ఉండాలి. లేదంటే వారి చదువు అటకెక్కడం ఖాయం.

ఫోన్లు విపరీతంగా చూస్తే కంటి సమస్యలు కూడా వస్తాయి. తల్లిదండ్రులు పిల్లలకు లాప్ టాప్ లు కూడా ఇస్తున్నారు. దీనిపై కాస్త ఆలోచించాల్సిందే. వారికి ప్రైవసీ ఇవ్వడం అసలు మంచిది కాదు. ఫోన్లు, లాప్ టాప్ లు పిల్లలకు దూరంగా ఉంచితేనే మంచిది. లేదంటే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఆన్ లైన్ లో ఆటలు ఆడకూడదు. కచ్చితంగా పిల్లలకు ఫోన్లు అందుబాటులో ఉంచడం శ్రేయస్కరం కాదు. పిల్లలకు చదువు మీదే దృష్టి కలిగేలా చేయాలి. ఫోన్లను వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రయోజనం.
పిల్లలతో సమయం వెచ్చించి గడపడం వల్ల వారి ఒంటరి తనాన్ని దూరం చేయొచ్చు. దీంతో వారి విషయాలు పంచుకుని వారి అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి. పిల్లలు గేమ్స్ ఆడకుండా చూడాలి. తల్లిదండ్రులు పిల్లల బాగోగులపై పట్టించుకోవాలి. పిల్లలు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడితే వారి హాబీ మార్చాలి. కొత్త విషయాలపై వారికి ఆసక్తి కలిగేలా చేయాలి. మంచి విషయాలపై ఏకాగ్రత పెట్టేలా చూడండి. దీంతో పిల్లలను గేమ్స్ కు దూరంగా ఉంచడం వీలవుతుంది. చీటికి మాటికి పిల్లల్ని కొట్టడం, తిట్టడం చేయకూడదు. దీంతో పిల్లలు మానసికంగా దృఢంగా మారుతుంది.

ఫోన్లు చూడకుండా ఉండటానికి వారిని కట్టడి చేయాలి. అవసరమైతే తప్ప వారి చేతిలో ఫోన్ ఉండకూడదు. వారికి ఇతర వ్యాపకాల వైపు వెళ్లేలా చేయాలి. ఎక్కువ సేపు ఫోన్ చేతిలో ఉండొద్దు. ఎప్పుడు చదువుకుని తెలివితేటలు పెంచుకోవాలి. పిల్లలు ఆన్ లైన్ గేమ్ లు ఆడకుండా జాగ్రత్త వహించాలి. ఫోన్లు చూడకుండా చేయాలి. వారికి ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ పోయేలా ఆసక్తి కలిగించాలి. వీడియో గేమ్స్ కు అతుక్కుపోకుండా పర్యవేక్షించాలి. పిల్లలు పాడు కాకుండా ఫోన్లు చూడకుండా చేయాలి.