Success: జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలో తెలుసా?

  Success: ఆచార్య చాణక్యుడు జీవితం గురించి ఎన్నో విషయాలు వివరించాడు. మన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలో చెబుతాడు. అలాగే ఏ పనులు చేస్తే మనం నష్టపోతామో సూచిస్తాడు. ఆనాడు ఆయన చెప్పిన మార్గాలు ఇప్పటికి మనకు అనుకూలంగానే ఉంటున్నాయి. జీవితంలో పైకి రావాలంటే ఏం చేయకూడదో అని తెలిపాడు. మనిషి జీవితంలో కొన్ని మనల్ని వెనక్కి నెట్టేస్తాయి. వాటిని అధిగమించి ముందుకు నడవాలి. అప్పుడే విజయాలు దక్కుతాయి. భయం మనలో ఉన్న […]

Written By: Srinivas, Updated On : April 25, 2023 11:07 am
Follow us on

 

Success: ఆచార్య చాణక్యుడు జీవితం గురించి ఎన్నో విషయాలు వివరించాడు. మన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలో చెబుతాడు. అలాగే ఏ పనులు చేస్తే మనం నష్టపోతామో సూచిస్తాడు. ఆనాడు ఆయన చెప్పిన మార్గాలు ఇప్పటికి మనకు అనుకూలంగానే ఉంటున్నాయి. జీవితంలో పైకి రావాలంటే ఏం చేయకూడదో అని తెలిపాడు. మనిషి జీవితంలో కొన్ని మనల్ని వెనక్కి నెట్టేస్తాయి. వాటిని అధిగమించి ముందుకు నడవాలి. అప్పుడే విజయాలు దక్కుతాయి.

భయం

మనలో ఉన్న భయాన్ని విడిచిపెట్టాలి. ఏ పని చేయాలన్నా భయపడితే కుదరదు. ముందడుగు వేయాలి. తరువాతే కదా మనకు విజయం లభించేది. కానీ ముందే నేను విజయం సాధిస్తానో లేదో అనే భయం ఉంటే ఏదైనా సాధించడం కష్టమే. అందుకే మనం మొదట మనలోని భయాన్ని విడిచిపెట్టాలి. లేకపోతే విజయం సాధించడం దుర్లభమే.

ఈర్ష్యద్వేషాలు వద్దు

ఒకరు జీవితంలో ముందుకు వెళ్తున్నారంటే అతడిని అభినందించాలి. మనం కూడా ఇంకా బాగా ఎదగాలని తపన పడుతూ నిరంతరం శ్రమించాలి. అంతేకాని అతడి విజయాలను చులకనగా చేసి మాట్లాడితే రేపు మనం సాధించిన విజయాలను కూడా ఇతరులు అలాగే చూస్తారు. అందుకే మనలో ఉన్న ఈర్ష్య ద్వేషాలను పక్కన పెట్టి సక్సెస్ ను ప్రశంసించడం నేర్చుకోవాలి.

దానాలు

ప్రతి వ్యక్తి తనకు ఉన్న దాంట్లో దానం చేయడం మంచిదే. కానీ అపాత్ర దానం చేయకూడదు. మనం చేసే దానం నిజమైన వారికి కాకుండా అవసరం లేని వాడికి చేస్తే మన సాయం పనికి రాకుండా పోతుంది. అందుకే అపాత్ర దానం చేయొద్దు. అర్హులకే అవి చెందేలా చూడాలి. అప్పుడే మనం చేసే దానానికి విలువ ఉంటుంది. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది. కానీ బాగా కడుపు నిండిన వాడికి అన్నం పెట్టడం సరైంది కాదు.

బద్ధకం

బద్ధకం ఉన్న వాడు ఏ పని చేయలేడు. ముందుకు వెళ్లలేడు. చేద్దాం చూద్దాం అంటూ కాలం వెళ్లదీస్తాడు. దీంతో అతడిలో ఎంత శక్తి ఉన్నా అది పనికి రాదు. కష్టపడి పనిచేస్తేనే జీవితంలో ముందుకు వెళతావు. దానికి అనుగుణంగా నడుచుకోవాలి. బద్ధకాన్ని వదిలి నీ గమనంలో ముందుకు నడిస్తేనే కదా విజయాలు సాధించేంది. ఇలా చాణక్యుడు తన నీతి శాస్ర్తంలో ఎన్నో విషయాలు చెప్పాడు.