Chanakya Niti Money: ప్రస్తుత రోజుల్లో అందరికి ఆర్థిక ఇబ్బందులు కలవరపెడుతున్నాయి. ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదని వాపోతున్నారు. ఇంట్లో అసలు డబ్బు ఉండటం లేదని అంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నారు. దీనిపై ఆచార్య చాణక్యుడు కూడా తన నీతిశాస్త్రంలో చాలా విషయాలు వివరించాడు. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులకు చక్కని పరిష్కారాలు చూపాడు.
లక్ష్మీదేవి అనుగ్రహం
మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో సూచించాడు. ఆర్థిక ఇబ్బందులను తలుచుకుని గొడవలకు పోకుండా మంచి ప్రేమానురాగాలతో ఉంటే సమస్యలు అవే తొలగిపోతాయి. డబ్బులకు కొదవ లేకుండా ఉండాలంటే ఆలుమగల మద్య ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఉంటే అవే సర్దుమనుగుతాయి. వాటిని తలుచుకుని ఇబ్బందులు పడటం కంటే వారి మధ్య చక్కనైన ప్రేమ ఉంటే అన్ని సాధ్యమే అంటున్నాడు చాణక్యుడు.
డబ్బు నిలవాలంటే ఏం చేయాలి
ఇంట్లో డబ్బు నిలవాలంటే చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సరి. భార్యను సాక్షాత్తు ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే డబ్బుకు కొదవ ఉండదు. పెద్దలను, గురువులను, పండితులను గౌరవించాలి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. జీవితంలో డబ్బు సంపాదించాలని అందరికి ఉంటుంది. కానీ ఆ డబ్బు నిలవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాణక్యుడు చెప్పిన మార్గాలు ఆచరణీయం.
సాధువులను..
ఇంట్లో డబ్బు నిలవాలంటే సాధువులను సేవించాలి. వారికి గౌరవ మర్యాదలు చేయాలి. అన్నాన్ని అన్నపూర్ణగా భావించాలి. అన్నం పడేయకూడదు. ఇంటికి అతిథి వస్తే సత్కరించాలి. వారికి భోజనం పెట్టి మర్యాదలు చేయాలి. ఇంటికి వచ్చిన అతిథిపై కోపం పెంచుకోరాదు. ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుంది. డబ్బు నిలువుంటుంది.