Titanic Submersible Tragedy: అట్లాంటిక్ మహా సముద్రంలో 12 వేల అడుగుల లోతులోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ అదృశ్యమైన ఐదుగురు ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి మినీ జలాంతర్గామి టైటాన్ లో వెళ్లారు. వెళ్లిన రెండో రోజుకి టైటాన్ అదృశ్యం కావడంతో నీరు కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టగా.. గురువారం ఈ జలాంతర్గామిలో ప్రయాణించిన ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో టైటానిక్ నౌక మునిగిపోయిన ప్రాంతంలోని పరిస్థితులు గురించి మరిన్ని విషయాలు మీ కోసం.
టైటానిక్ చుట్టూ ఉన్న నీళ్లు చాలా ప్రమాదకరం..
టైటానిక్ నౌక మునిగిపోయిన ప్రాంతంలో చుట్టూ ఉన్న నీళ్లు కూడా అత్యంత ప్రమాదకరమైనవిగా చెబుతున్నారు. టైటానిక్ నౌక సుమారు నాలుగు కిలోమీటర్ల లోతులో సముద్రం అడుగున ఉంది. చిమ్మ చీకటి లోపల ఆవరించి ఉంటుంది. దీన్నే మిడ్ నైట్ జోన్ అని కూడా అంటారు. సూర్యుడు కాంతి అంత లోపలికి వెళ్లే అవకాశం లేదు. సబ్బు మెర్సిబుల్ లైట్ కొంత దూరమే కాంతిని ఇస్తుంది. టైటాన్లు ఇంకా చూసేందుకు వెళ్లే జలాంతర్గాములు సముద్రంలో దారి తప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రాంతంలో నీటి ఒత్తిడి కూడా అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సముద్రం అడుగున నీటి ఒత్తిడి ఉపరితలం కంటే 390 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే సబ్ మెర్సబుల్ కు మందపాటి గోడలు ఉండాలి. అలాగే ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా ఉండడానికి మరో కారణం నీటి ప్రవాహాలుగా కూడా చెబుతున్నారు. ఉపరితలంపై అలలు, గాలులు, నీటి సాంద్రతలో తేడాల కారణంగా నీటి లోపల బలమైన ప్రవాహాలు వస్తుంటాయి. ఇది కూడా జలాంతర్గాములు ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే టైటానిక్ శిథిలాలు కూడా ప్రమాదానికి హేతువులుగా ఉంటాయని చెబుతున్నారు. టైటానిక్ వందేళ్ళకు పైగా నీటిలో ఉంది. ఇది తుప్పు పడుతోంది. కూలిపోతోంది కూడా. ఒకవేళ టైటానిక్ వాడకు దగ్గరలో టైటాన్ జలాంతర్గామి వెళ్లి ఉంటే అది దాన్ని ఢీ కొట్టి ఉండవచ్చు. ఆ విధంగా టైటాన్ జలాంతర్గామి సమాధానికి గురై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణీకులు వీళ్ళే..
టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు టైటాన్ జలాంతర్గామిలో వెళ్లి ఐదుగురు ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రాణాలు కోల్పోయిన వారిలో పాకిస్థాన్ కు చెందిన బిలియనీర్ షాజాద్ దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈ లో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నావిక దళ అధికారి పాల్ హెన్రీ ఉన్నారు.