Shani Dev: ఎవరికైనా మంచి జరగడం లేదంటే వాడికి శని పట్టింది అంటారు. శని దేవుడు చూపు లేకపోతే ఇబ్బందులే ఎదురవుతాయి. శని కొన్ని సందర్భాల్లో మంచిని మరికొన్ని సందర్భాల్లో చెడును కలిగిస్తుంది. కొన్ని సంకేతాలు మన మీద శని చూపు ఉన్నట్లు తెలియజేస్తాయి. కొన్ని మాత్రం దరిద్రం పట్టుకుందని రుజువు చేస్తాయి. శనీశ్వరుడు పేరు చెబితే ఉలిక్కిపడతాం. శని పేరు వింటేనే అందరికి దడ పుడుతుంది. జాతకంలో శని ప్రభావం ఉండకూడదని చెబుతుంటారు. ఏలిననాటి శని, అర్దాష్టమ శని అని రకరకాల పేర్లు పెడుతుంటారు. శనీశ్వరుడు కూడా కొన్ని సమయాల్లో మంచి ఫలితాలు అందిస్తూ ఉంటాడు.

ప్రతి శనివారం శనీశ్వరుడిని పూజిస్తుంటారు ఇళ్లలో శని విగ్రహం ఉండకపోవడంతో దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. శనిదేవుడు ఎవరి మీదనైనా చెడు దృష్టితో చూస్తే చెడు ఫలితాలు, మంచి దృష్టితో చూస్తే మంచి ఫలితాలు రావడం కామనే. శని దేవుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించడానికి ఎవరు సాహసించరు. శనీశ్వరుడు ప్రసన్నం అయితే సర్వతోముఖ ఫలితాలు ఇస్తాడు. శనీశ్వరుడి కృప ఉంటే మంచి మార్పులు వస్తాయి. శని దేవుడి అనుగ్రహంతో జీవితంలో మంచి ప్రయోజనాలు దక్కుతాయి.
శని అనుగ్రహం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. శని దేవుడి ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమే. రోగులకు సహాయం చేయడం కోసం విరాళాలు ఇవ్వడం మంచిది. ఇలా చేస్తే శని దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది. మన కీర్తి ప్రతిష్టలు పెరగాలంటే శని ప్రభావం మన మీద ఉండాలి. శనీశ్వరుడు ప్రసన్నుడు అయితే మన కీర్తి పెరుగుతుంది. శనివారం బూట్లు లేదా చెప్పులు అపహరణకు గురైతే శుభం కలుగుతుందని చెబుతారు. శని దేవుడు మన పట్ల మంచి దృష్టితో చూస్తున్నాడని అర్థం.

శనీశ్వరుడి దృష్టి పడకుండా చెడు ఫలితాలు కలగకుండా ఉండాలంటే పేదలకు దానం చేయడం మంచిది. దానధర్మాలు చేయడం వలన తమ బలహీనతలు దూరం చేసుకోవచ్చు. తమ కంటే బలహీనంగా ఉన్న వారికి సాయం చేస్తే శని దయ మన మీద ఉంటుంది. శనీశ్వరుడి చొరవ వల్ల మనకు ఎన్నో పనులు పూర్తవుతాయి. శని వక్రమార్గంలో చూస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో శనీశ్వరుడు మనకు మంచి కలిగించడానికి శనివారం పూజలు చేసి అతడిని ప్రసన్నం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావచ్చని తెలుసుకోవాలి.