Beard: పేడు మూతి వాడు ఎప్పటికి పెళ్లికొడుకు అంటారు. వయసు వచ్చిందని సూచనకే మీసాలు, గడ్డాలు వస్తాయి. అవి రాలేదంటే అతడికి వయసు రానట్లే లెక్క. కొంతమందికి గడ్డాలు, మీసాలు రావు. చూడ్డానికి ఆడవారిలా ఉంటారు. దీంతో వారికి నలుగురిలో కలవడానికి ఫీలింగ్ ఉంటుంది. ఏమంటారో అని భయపడుతుంటారు. గడ్డాలు, మీసాలు వస్తేనే మగాడికి విలువ ఉంటుంది. వాటిని చూసే గుర్తిస్తారు. అవి రాలేదంటే అవమానంగా భావిస్తారు.
కొందరు త్వరగా మీసాలు, గడ్డం రావాలని రోజు షేవ్ చేస్తుంటారు. ఇది కరెక్టు కాదు. రోజు షేవ్ చేయడం ద్వారా వెంట్రుకలు రావు. వెంట్రుకలు పెరగడానికి ముందు షేవ్ చేసుకుని తరువాత స్ట్రీమింగ్ చేసి పదునుగా ఉండే బ్లేడ్, వేడి నీటి సాయంతో చేసుకోండి. ఎలక్ర్టానిక్ ట్రిమ్మర్ కు బదులుగా రేజర్ వాడితే ప్రయోజనం ఉంటుంది. మీసాలు, గడ్డం కోసం నానా తంటాలు పడుతుంటారు.
ఇలా చేయడం వల్ల నష్టాలు వస్తాయి. అధికంగా పాలికిల్ లు ఉద్దీపనలకు గరవడం వల్ల వెంట్రుకలు మితిమీరిన స్థాయిలో వచ్చే ప్రమాదం ఉంటుంది. వెంట్రుకలు పెరగడానికి ఏదైనా క్రీమ్ పెట్టుకునేటప్పుడు చేతివేళ్లతో గడ్డం చర్మాన్ని లాగి క్రీములు రాసుకోవాలి. దీంతో గడ్డం ఉన్న ప్రాంతంలోని అన్ని వెంట్రుకలకు సమపాళ్లలో అందుతుంది. ఇలా మనం మీసాలు, గడ్డం రావడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.
ఉసిరి లేదా యూకలిప్టస్ ఆయిల్ తో ముఖాన్ని మర్దన చేస్తే వెంట్రుకలు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. వెంట్రుకలు వేగంగా పెరగడానికి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. ఆకుకూరలు, చికెన్, మటన్, చేపలు, ధాన్యాలు, బీన్స్ వంటివి తీసుకోవడం ద్వారా ముఖంపై వెంట్రుకలు పెరుగుతాయి. మీసాలు గడ్డం ఉంటేనే మగాడిగా గుర్తింపు లభిస్తుంది.