Health Tips: మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆరోగ్య సంరక్షణలో అనవసరమైన వాటిన త్యజించి అవసరమైన వాటిని చేర్చుకోవాలి. బలమైన ఆహారంతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉందని గ్రహించాలి. ఏది పడితే అది తింటూ ఒళ్లు గుళ్ల చేసుకోవద్దు. మితమైన ఆహారం తీసుకుంటేనే మనకు మంచి శక్తులు వస్తాయి. ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే పదార్థాలను తీసుకునేందుకు మొగ్గు చూపాలి. లేదంటే మన ఆరోగ్యం మందగిస్తే దుష్ఫలితాలు రావడం ఖాయమే.

ఎప్పుడైనా భోజనానికి ముందు ఒక పండు తీసుకుంటే మంచిది. అది ఏ పండు అయినా సరే తినడానికి ఓ అరగంట ముందు పండును తీసుకుంటే మనకు ప్రయోజనం. ఇది మన శరీర బరువు పెరగకుండా నిరోధిస్తుంది. పండ్లలో ఉండే నీటిశాతం, ఫైబర్ మనకు ఉపయోగపడతాయి. ఆరోగ్యకరంగా ఉండాలంటే సమతుల్యమైన బరువుతో ఉండాలి. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా మన దేహానికి ఎన్నో సమస్యలు చుట్టుముడతాయనడంలో సందేహం లేదు.
Also Read: Cheteshwar Pujara: గేర్ మార్చి, రయ్యిన దూసుకెళ్తున్న పుజారా
శారీరక శ్రమ కూడా అవసరమే. మనం కదలకుండా ఉండటం వల్ల సమస్యలు వస్తాయి. అందుకే రోజులో ఏదో ఒక పని చేసి కాస్త శరీరాన్ని అలసటకు గురి చేస్తే మనకు ఎంతో ఉత్తమం. దీంతో చెమట పట్టి మన దేహానికి హాయిగా ఉంటుంది. వారంలో కనీసం నాలుగైదు రోజులైనా 45 నిమిషాల నుంచి గంట పాటు వాకింగ్ చేయాలి. వ్యాయామం చేస్తే ఇంకా మంచిది. వాకింగ్, జాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ ఏదైనా ఫర్వాలేదు రోజు చేస్తే లాభమే. దీంతో మనం ప్రతి రోజు వీటితో కొంతైనా శారీరక శ్రమ చేస్తే మన ఒంటికి ఎంతో మేలు.

ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అందులో ఉండే చక్కెర, ఉప్పుతో మన శరీరానికి ముప్పు ఏర్పడవచ్చు. అందుకే ఎప్పుడైనా వీటిని దరికి రానీయొద్దు. వీటిని తీసుకుంటే మనకు ఎన్నో అనర్థాలు చోటుచేసుకుంటాయి. శరీరంలో కొవ్వును కరిగించుకుంటేనే మనం అధిక బరువును తగ్గించుకోగలం. అందుకే బయట దొరికే వాటిని తినకూడదు. రోజువారీ ఆహారంలో చక్కెర పదార్థాలను సాధ్యమైనంత వరకు వాడకపోవడమే శ్రేయస్కరం. దీన్ని గుర్తుంచుకోవాలి. తరచుగా ఫాస్ట్ ఫుడ్స్ తింటుంటే మన ఆరోగ్యం గుళ్ల కావాల్సిందే.
మన ఆరోగ్యానికి ఉపవాసాలు కూడా నష్టమే. ఉపవాసాలతో మెటబాలిజం దెబ్బతింటుంది. నీరసం, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మాంసకృత్తులు, పీచు పదార్థాలు అధికంగా ఉండే స్నాక్స్ తింటే ఆకలి వేయదు. సమయానికి భోజనం చేయకుండా ఉపవాసాలు చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. పోషకాలు అధికంగా ఉండే వాటిని తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. రోజుకు రెండు సార్లు భోజనం చేయాల్సిందే. లేకపోతే నీరసం వచ్చి కళ్లు తిరుగుతాయి. తద్వారా మన ఆరోగ్యం పాడవుతుంది.
మన ఆరోగ్యానికి కంటి నిండా నిద్ర కూడా ప్రధానమే. రోజుకు కనీసం నాలుగు గంటలైనా నిద్ర పోవాల్సిందే. కంటి నిండ నిద్ర ఉండేనే రోజంతా హుషారుగా ఉంటుంది. లేదంటే బద్దకం ఆవహిస్తుంది. మారుతున్న కాలంలో టీవీలు, ఫోన్లు చూస్తూ ఆహారం తీసుకోవడం వల్ల ఇబ్బందులే వస్తాయి. పిండిపదార్థాలు, మాంస కృత్తులు, కొవ్వులు ఉండే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి.
మంచినీళ్లు కూడా సమపాళ్లలో తీసుకోవాలి. ప్రతి రోజు కనీసం ఐదు లీటర్ల నీటిని తాగుతూ ఉండాలి. అలా చేస్తేనే మన రక్తం ప్రసరణ బాగా జరిగి అన్ని భాగాలకు రక్తం వెళ్తుంది. లేదంటే రక్తప్రసరణ మందగిస్తే ప్రమాదమే. దీంతో చాలా అనర్థాలు వస్తాయి. అందుకే మన ఆహారంలో మంచినీరు కూడా ఒక భాగమే. మగవారు ఐదు, ఆడవారు నాలుగు లీటర్ల నీటిని తాగుతూ ఉండాల్సిందే.
Also Read:KCR Politics: ‘బండి సంజయ్’ అరెస్ట్ కు కవితకు సంబంధమేంటి? కేసీఆర్ ‘డైవర్ట్ పాలిటిక్స్’ సక్సెస్