Heart Attack: మనదేశంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగానే ఉంది. దీంతో రోజువారీ పనుల్లో కదలికలు లేకుండా చేసుకోవడంతో మనిషుల్లో బద్దకం పెరిగిపోతోంది. ఫలితంగా హృద్రోగుల సంఖ్య పెరిగిపోతోంది. గుండె జబ్బులకు మనదేశమే రాజధానిగా మారుతోంది. ఈ నేపథ్యంలో గుండెజబ్బుల ప్రమాదాలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో వైద్యుల సూచనలు సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలో గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం కదలకుండా చేసే పనులే కావడం గమనార్హం.

గుండె జబ్బులు రావడానికి దారి తీసే అంశాల్లో ఎక్కువ సేపు కదలకుండా ఉండి పనిచేయడమే అని తెలుస్తోంది. గతంలో అయితే పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం భోజనం చేసి పడుకునే వారు. ఎలాంటి ఆలోచనలు ఉండేవి కావు. నేటి కాలంలో ప్రతి పని కదలకుండా చేయడంతో ఒళ్లు వంచాల్సిన అవసరం రావడం లేదు. దీంతోనే గుండెజబ్బులు పెరుగుతున్నాయి. మనిషిలో క్రమశిక్షణ లోపించడమే హృద్రోగ కేసులు వస్తున్నాయి.
Also Read: Monkeypox: యజమాని గే..స్వలింగ సంపర్కం.. బెడ్ పై పడుకున్న కుక్కకు మంకీపాక్స్
గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలి. ఉదయం, సాయంత్రం నడక కొనసాగించాలి. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న వారికి గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే వీలున్నందున వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రోజు మనం తీసుకునే ఆహారం కూడా రోగాలు రాకుండా చేస్తుంది. తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. అందులో గుండె జబ్బులను దూరం చేసే పలు పండ్లు ఆహారంగా తీసుకోవడం ఉత్తమం.

శరీరంలో కొవ్వు శాతం పెరిగితే రక్తప్రసరణ దెబ్బతిని గుండెపోటు వచ్చే ప్రమాదముంది. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారాలు తీసుకోవడంతో గుండెజబ్బుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తెలుసుకోవాలి. గుండె జబ్బుల బారిన పడితే ప్రమాదమే. అందుకే దీనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తీసుకునే ఆహారం, వ్యాయామం తదితర పనుల ద్వారా గుండె జబ్బు నుంచి రక్షించుకోవచ్చు. వైద్యుల సూచనలతో రోజువారీ డైట్ ను మార్చుకుంటే ప్రయోజనం ఉంటుంది.
Also Read:AP teachers Concern : ఉపాధ్యాయులను వదిలించుకొనే జగన్ కుట్ర..