Dil Raju pain has no meaning: నిర్మాతల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే వాటిని మీడియానే చెడగొడుతోందని నిర్మాత దిల్ రాజు తెగ ఎమోషనల్ అవుతూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నిజంగా నిర్మాతల మధ్య ఐక్యత ఉంటే.. ప్రతి సినిమా రిలీజ్ విషయంలో ఎందుకు రాద్దాంతం జరుగుతుంది?, అలాగే ప్రతి చిన్న సినిమాకి థియేటర్స్ దొరకడం లేదు అని ఎందుకు చిన్న నిర్మాతలు ఆరోపణలు చేస్తున్నారు?, అన్నిటికీ మించి నిర్మాతల మండలిలో నిత్యం నిర్మాతల మధ్య వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయి. ఇవన్నీ దిల్ రాజుకు తెలియదా ?, అయినా కార్తికేయ 2 సక్సెస్ ఫంక్షన్ లో చాలా ఫీల్ తో మాట్లాడాడు. దాంతో అందరి కంటే దిల్ రాజు స్పీచే హైలైట్ అయ్యింది. అయితే, దిల్ రాజు ఎంత సేపు మాట్లాడినా ఆయన తన స్పీచ్ లో ప్రధానంగా రెండురకాల ఆరోపణలు చేసాడు.

Also Read: Big Boss 6: బిగ్ బాస్ 6 టెలికాస్ట్ తేదీ మరియు టైమింగ్స్
అందులో మొదటిది మీడియా ఇష్టం వచ్చినట్లు నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తున్నారని, అనవసరంగా ప్రేక్షకులను తప్పుద్రోవ పట్టిస్తున్నారని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక రెండో టాపిక్ విషయానికి వస్తే.. యూ ట్యూబ్ వ్యూస్ కోసం బరి తెగిస్తున్నారని.. ఇండస్ట్రీ లో ఒకటిగా ఉన్న తమను విడగొడుతున్నారని. ఈ రెండో టాపిక్ విషయంలో కొంత నిజం ఉంది. చాలా యూ ట్యూబ్ చానెళ్లు ఇదే చేస్తున్నాయి. కంటెంట్ తో సంబంధం లేని థంబ్ నెయిల్స్ పెడుతూ.. ఏ మాత్రం నిజం లేని వార్తలను వండి వడ్డిస్తూ ఇష్టం వచ్చినట్లు గాసిప్స్ ను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ2 సినిమాని దిల్ రాజు తొక్కేశాడు అని పుకార్లు పుట్టించారు.

Also Read: Shekhar Kammula – Mahesh Babu: మహేష్ బాబు తో లీడర్ 2 సినిమా చెయ్యబోతున్న శేఖర్ కమ్ముల
నిజానికి దిల్ రాజు ప్రస్తావన లేకున్నా, ఆయన పేరుతో దారుణమైన థంబ్ నెయిల్స్ పెట్టీ.. వ్యూస్ కోసం తమ పరిధులు దాటారు. అసలు దీనికి కారణం ఎవరు ?, దిల్ రాజే. నిప్పు లేనిదే పొగ ఎలా వస్తోంది ?, కొంత కూడా నిజం లేనిది అడ్డగోలుగా ప్రధాన వెబ్ సైట్స్ లో వార్తలు రావు. ఊరు పేరు లేని యూట్యూబ్ చానల్స్ ను పక్కన పెడదాం. కానీ.. ప్రధాన పత్రికలు కూడా ఇండస్ట్రీలో ఆ నలుగురు గురించి గత పదేళ్లుగా కథలు కథలుగా రాస్తనే ఉన్నాయి. ఇండస్ట్రీ జనాల్లో కూడా ఇదే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కాబట్టి.. దిల్ రాజు ఆవేదన లేదా ఆగ్రహంలో అర్థం లేదు. అయినా వెబ్ సైట్స్ లో ఆర్టికల్స్ రాసే ముందు నిజం తెలుసుకుని రాయాలి అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. సత్తా ఉన్న ప్రతి సైట్ నిజాలను నిర్భయంగా రాస్తున్నాయి. అలా రాయడమే దిల్ రాజుకి నచ్చలేదు. అయినా క్లారిఫికేషన్ తీసుకోవడం అన్నది సాధ్యం అయ్యే పని కాదు. అసలు కార్తికేయ 2 సినిమాని దిల్ రాజు తొక్కడా ? లేదా ? అనే విషయం తెలుసుకుందాం.

కార్తికేయ 2 చిత్రాన్ని జూలై 22న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ ను దిల్ రాజు లాగేసుకున్నాడు. నైజాంలో, వైజాగ్ లోనే కాదు, అన్ని ప్రాంతాల్లో దిల్ రాజుకు డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉంది కాబట్టి.. ఆయన అడిగితే ఏ హీరో అయినా, ఏ నిర్మాత అయినా తన సినిమా పోస్ట్ పోన్ చేసుకోక తప్పదు. ఇది దిల్ రాజు దృష్టిలో తప్పు కాకపోవచ్చు. కానీ.. చిన్న నిర్మాతలకు ఇది తలకు మించిన భారం. నిఖిల్ అదృష్టం కొద్దీ మాచర్ల నియోజకవర్గం సినిమా ఫ్లాప్ అయింది. లేకపోతే కార్తికేయ 2 పరిస్థితి ఏమిటి ? ఏది ఏమైనా దిల్ రాజు ఎమోషన్ లో నిజం లేదు.