
Deepika Padukone- Kangana Ranaut: ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇక ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని బాలీవుడ్ నటిమణి దీపికా పదుకునే తన వ్యాఖ్యానం తో నిర్వహించింది. వాస్తవానికి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని హాలీవుడ్ నటీమణులతో నిర్వహిస్తారు. కానీ ఈసారి భిన్నంగా దీపికా పదుకొనేతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు.. దీపిక భాష సరళంగా ఉండటంతో అందరికీ అర్థమైంది. యావత్ ప్రపంచం ఇప్పుడు ఆమె వ్యాఖ్యానానికి ఫిదా అవుతున్నది. కొద్దిరోజుల క్రితం పఠాన్ సినిమాలో బే శరం అనే పాటలో హాప్ న్యూడ్ గా నటించింది అని విమర్శించిన వారే, ఇప్పుడు ఆమెను వెయ్యినోళ్లతో పొగుడుతున్నారు.. ఆ జాబితాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా చేరింది.
దీపిక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇండియన్ సినిమాకు, ఇండియన్ నటికి దక్కిన గౌరవంగా ఆమె అభిప్రాయపడింది.. గతంలో ఆమె హాలీవుడ్ సినిమాల్లో నటించిందని ఆ అనుభవం ఇప్పుడు ఉపయోగపడిందని ఆమె కితాబిచ్చింది. దీపిక వ్యాఖ్యానం పట్ల హర్షం కంగనా ఆ ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ” దేశం మొత్తాన్ని ఏకతాటిపై ఉంచి అక్కడ పాల్గొనడం అంత సులభం కాదు. దేశ కీర్తి, ప్రతిష్టలను భుజాలపై మోస్తూ దీపికా పదుకొనే ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంటే ఆమె టీవీలో చూడటం అద్భుతంగా ఉంది. భారతీయ మహిళలు గొప్పవారు అని చెప్పేందుకు ఆమె ఒక సాక్ష్యం అని” కంగనా రాసుకొచ్చింది.
ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ లో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కు కంగనా శుభాకాంక్షలు చెప్పింది. ” జాతి ప్రాతిపదికన భారతీయులను అణచివేసిన, హింసించిన, వలస రాజ్యానికి సంబంధించిన సినిమా ప్రపంచ వేదికపై ప్రశంసలు అందుకుంది. ఊచ కోతకు గురైన యూదుల కంటే బెంగాల్ కరువులో మరణించిన భారతీయుల సంఖ్య ఎక్కువ. ఆర్ఆర్ఆర్ టీం కు ధన్యవాదాలు” అని కంగనా ట్వీట్ చేశారు.

ఇక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన దీపిక, ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రధారి రామ్ చరణ్ తేజ్ గతంలో పెప్సీ యాడ్ లో నటించారు. అప్పట్లో రామ్ చరణ్, దీపికాకు ఇంతటి స్టార్ డం లేదు. వారు ఇద్దరు తమ ప్రతిభతో గ్లోబల్ స్థాయికి వెళ్లినప్పటికీ నాటి స్నేహాన్ని మర్చిపోలేదు.. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించ కంటే ముందు రామ్ చరణ్ తేజ్ దీపిక తో కలిసి ఓ ఫోటో దిగారు..ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.