Two Eclipses In 15 Days: పదిహేను రోజుల్లో రెండు గ్రహణాలు అరిష్టానికి సంకేతాలు. నెల రోజుల్లో రెండు గ్రహణాలు ఏర్పడటం భారీ నష్టానికే అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గ్రహణాల మధ్య ఇంత తక్కువ నిడివి ఉన్న సందర్భాల్లో పలు ఉపద్రవాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్లకు ఒకసారి ఇలాంటి గ్రహణాలు ఏర్పడతాయని చెబుతుంటారు. రెండు గ్రహణాలు వెంట వెంటనే ఏర్పడటం ఇబ్బందులు తెస్తుందని అంటారు. గ్రహణాల వల్ల ఏర్పడే నష్టాల గురించి పండితులు పలు సూచనలు చేస్తున్నారు.

మహాభారతం సమయంలో కూడా రెండు గ్రహణాలు ఏర్పడ్డాయట. దీంతో కురుక్షేత్ర సంగ్రామం వచ్చిందట. అందులో ఎంత మంది చనిపోయారో చదువుకున్నాం. మహాభారత సంగ్రామం చరిత్రే సృష్టించింది. ఎన్నో లక్షల మంది చనిపోవడంతో ఎంతటి ఉపద్రవం కలిగిందో తెలుసుకున్నాం. 15 రోజుల్లో రెండు గ్రహణాలు రావడంతో ఇలా జరిగిందనే చెబుతున్నారు. ఈ సంవత్సరం దీపావళి (అక్టోబర్ 25)న సూర్య గ్రహణం ఏర్పడటంతో నవంబర్ 8న చంద్రగ్రహణం రానుంది. దీంతో రెండు గ్రహణాలు ఎంతటి కష్టాలు తెస్తాయోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి.
ఎప్పుడో వచ్చే గ్రహణాలు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని నమ్ముతున్నారు. ఏం పరిణామాలు చోటుచేసుకుంటాయో అర్థం కావడం లేదు. నెల రోజుల్లో రెండు గ్రహణాలు రావడం ప్రజల్లో ఆందోళనలకు కారణమవుతోంది. ఎలాంటి నష్టాలు సంభవిస్తాయోననే బెంగ నెలకొంది. భవిష్యత్ లో ముప్పు మాత్రం ఏర్పడటం ఖాయమని తేలిపోతోంది. కానీ ఏం నష్టం కలుగుతుందో మాత్రం అంతుచిక్కడం లేదని అంటున్నారు. గ్రహణాల ప్రభావం అంతలా ఉంటుందని అందరు భయపడుతున్నారు.

ఐదు రాశుల వారికి కష్టాలు తప్పవని పండితులు తెలియజేస్తున్నారు. మేషం, వృషభం, తుల, కన్య, సింహ రాశులకు ప్రతికూల ప్రభావాలు వస్తాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. దీంతో గ్రహణాల ప్రభావంతో వచ్చే ఇబ్బందులపై జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు గ్రహణాలు ప్రజలకు కష్టాలు రానున్నాయని సమాచారం. ఈక్రమంలో సూర్య, చంద్ర గ్రహణాలు రాబోయే రోజుల్లో ఎలాంటి ముప్పు తెస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.