Allu Arjun- Sirish: అల్లు వారి ఇంటి నుంచి స్టార్లు మారిన హీరోల్లో ఒకరు అల్లు అర్జున్..మరొకరు అల్లు శిరీష్. వీరిద్దరు అన్నదమ్ములు. కానీ ‘బన్నీ నాకు తండ్రితో సమానం..’ అని శిరీష్ చెప్పడంతో ఆడియన్స్ ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా శిరీష్ అన్న మాటలకు బన్నీ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. అల్లు శిరీష్ లెటేస్టుగా నటించిన మూవీ ‘ఊర్వశివో.. రాక్షాసివో’. ఈ సినిమా ఈవెంట్ కు అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ తన ఫ్యామిలీ విషయాలను అందరితో షేర్ చేసుకొని ఆకట్టుకున్నాడు.

‘ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఎప్పటిలాగే అందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు. సినిమా కోసం డైరెక్టర్ తీసుకున్న శ్రద్ధ ని చూస్తే చాలా ముచ్చటేసింది. అయితే కొన్ని రోజులు ఈ సినిమా గురించి చాలా పుకార్లు వచ్చాయి. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మా అన్నయ్య బన్నీ ఒక్క ట్వీట్ కూడా చేయలేదని కొందరు అన్నారు. మా మధ్య విభేదాలున్నాయని చెప్పుకొచ్చారు.’ అని అన్నారు.
‘అన్నయ్య అంటే నాకు ప్రాణం.. తను నన్ను ఎప్పుడూ కొడుకులానే భావించేవారు. ఇప్పటికీ తనను సోషల్ మీడియాలో ‘బీబీ శిరీ..’ అని మెసేజ్లు పెడుతూ ఉంటారు. జీవితంలో నేనూ ఏదీ సాధించాలనుకున్నానో.. అవన్నీ నాకు బన్నీ సాధించి ఇచ్చాడు. అలాంటి మా మధ్య విభేదాలున్నాయని అంటున్నారు. ట్వీట్టర్లో స్పందిస్తేనే ప్రేమ ఉన్నట్లా..? తన తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం’ అని అల్లు శిరీష్ అన్నారు.

అల్లు శిరీష్ అన్న ఈ మాటలకు బన్నీ కళ్ల వెంట నీళ్లు కారాయి. దీంతో తన కన్నీళ్లు తుడుచుకుంటుండగా అక్కడున్న కెమెరాలను ఆయన వైపే తిప్పాయి. అటు అల్లు శిరీష్ కూడా బన్నీని చూసి కాస్త ఎమోషనల్ అయ్యారు. దీంతో ఇంతకాలం అల్లు బ్రదర్స్ మధ్య విభేదాలకు చెక్ పెట్టినట్లయిందని బన్నీ ఫ్యాన్ష్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.