Vastu Tips: ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. చిన్న చిన్న విషయాలైనా సరే రాజీపడకుండా ఇంటిని నిర్మించుకుంటాం. అన్ని సజావుగా ఉండేలా చూసుకుంటాం. ఏ విషయంలో కూడా తగ్గకుండా ఇల్లు నిర్మించుకునేందుకు చర్యలు తీసుకోవడం సహజం. ఇల్లు నిర్మించుకునేటప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. వాస్తు పరమైన అంశాలను లెక్కలోకి తీసుకుని ప్రతి విషయంలో జాగ్రత్తగా మసలుకుంటాం. వాస్తు శాస్త్ర రీత్యా ఏ దిశలో ఏముండాలనే దానిపై స్పష్టంగా ఆలోచిస్తాం. ఇంటి పరిసరాల విషయంలో కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం కామనే.

అన్ని విషయాలు వాస్తు శాస్త్ర పండితుల ద్వారా తెలుసుకుని వాటిని తూచ తప్పకుండా పాటించేందుకు మొగ్గు చూపుతాం. సొంత నిర్ణయాలు కాకుండా వాస్తు శాస్త్ర రీత్యా ఉండేందుకు అప్రమత్తంగా వ్యవహరిస్తాం. కిటికీలు, దర్వాజాలు అన్ని సరిసంఖ్యల్లో నే ఉండేలా చూసుకుంటాం. ఇంటి గోడకు, ప్రహరీకి ఎలాంటి కనెక్షన్ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రహరీ ఆనుకుని ఎలాంటి గోడలు ఉండకూడదు. బాత్ రూం వంటివి కూడా ప్రహరీకి ఆనుకోకూడదు. మెట్ట కింద స్టోర్ రూం కానీ బాత్ రూం కాని ఏర్పాటు చేసుకోవడం అరిష్టమే.
ఈశాన్యంలో బరువైన వస్తువులు ఉండకూడదు. ఇల్లు కడిగిన నీళ్లు తూర్పు లేదా ఉత్తరం వైపు నుంచి బయటకు వెళ్లడం ఉత్తమం. పడమర, దక్షిణ దిశల్లో వెళ్లకూడదు. ఇంటి నిర్మాణం చతురస్రం లేదా దీర్ఘ చతురస్ర ఆకారాల్లో మాత్రమే నిర్మించుకోవాలి. రైలు డబ్బాలా పొడవుగా ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదు. ఈశాన్య గదిలో దంపతులకు బెడ్ రూం ఏర్పాటు చేయకూడదు. ఎక్కువ అంతస్తులు కలిగిన భవనంలో అందరికి సరైన దిశలో గదులు ఏర్పాటు చేసుకుంటేనే మంచిది.

తల్లిదండ్రులు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలి. పెద్దకొడుకు మొదటి అంతస్తులో నివాసం ఉండాలి. రెండో కొడుకు రెండో అంతస్తులో, మూడో కొడుకు మూడో అంతస్తులో నివాసం ఉండేలా చూసుకోవాలి. ఇలా ఇంటి నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎలాంటి వాస్తు దోషం ఉండదు. ఇలా వాస్తు నియమాలు పాటించి మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా వాస్తు పద్ధతులు పాటిస్తేనే మనకు ఆపదలు రాకుండా ఉంటాయి. వాస్తు శాస్త్ర రీత్యా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు కష్టాలు రావని తెలుసుకోవాలి.