Vastu For Bedroom: భార్యాభర్తలకు పడక గది స్వర్గం లాంటిది. దీంతో బెడ్ రూంలో ఇతర విషయాల గురించి చర్చించడం సమంజసం కాదు. పడక గదిలో రొమాన్స్ కే ప్రాధాన్యం ఇవ్వాలి. దంపతులు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరిపై మరొకరికి ఇష్టం పెరగాలి. దీంతో ప్రేమానురాగాలు బలపడతాయి. అంతేకాని ఇతర అనవసర విషయాలు చర్చించుకుంటే మూడ్ అవుటవుతుంది. మనసు బాగా లేకపోతే మనకు ఏ విషయం మీద కూడా శ్రద్ధ ఉండదు. దీంతో భాగస్వామి ఆగ్రహానికి గురవుతాం. దీంతో మనకు అనుకున్నది ఒకటి అయిందొక్కటిగా మారి జీవితం నరకంలా మారుతుంది. అందుకే బెడ్ రూంను నిద్రకు, శృంగారానికి వేదికగా చేసుకుంటే వారి సంసారం నందనవనమే.

కొందరు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఆఫీసులో విషయాలు ఇంట్లో డిస్కస్ చేస్తే భార్యకు ఆగ్రహం వస్తుంది. మీ ఆఫీసు విషయాలు ఇంట్లోకి తీసుకురాకండని కసురుకునే అవకాశం ఉంది. మరికొందరైతే ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇలా భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఇలాంటి విషయాలు చర్చించుకుంటే ఇక శృంగారం మీద ధ్యాస ఎక్కడ ఉంటుంది. ఆ బాధలతోనే కాలం కాస్త హరీమంటుంది. దీంతో ఏం చేయలేని పరిస్థితి ఎదురవుతుంది.
మరికొందరైతే మాజీ ప్రియుడు, ప్రేయసి గురించి కూడా టాపిక్ తీస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. తోబుట్టువుల గురించి కూడా చర్చ పెడతారు. ఇవన్నీ కాదు మనకు బెడ్ రూంలో మనసు విప్పి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే బదులు ఇతర విషయాలు చర్చకు వస్తే భాగస్వామి మనసు కకావికలం అవుతుంది. దీంతో సంసారంలో కలతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. పడక గదిలో ఇతర విషయాల గురించి లేవనెత్తకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు బెడ్ రూంలో వ్యక్తిగత విషయాలు మాత్రమే చర్చించుకోవడం ఉత్తమం.

అనవసర విషయాల గురించి డిస్కస్ చేస్తే మన మెదడు పాడైపోతుంది. తద్వారా నిద్ర లేమి బాధ వెంటాడుతుంది. సరిగా నిద్ర పోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో మనం ఏ పని చేయలేం. పడక గదిలో దంపతుల విషయాలు మాత్రమే మాట్లాడుకుంటే మనసు హాయిగా ఉంటుంది. తద్వారా ఏ చిక్కులు రావు. ఎక్కడ చేసే పని అక్కడ చేస్తేనే దానికి విలువ. కుటుంబ విషయాలు బెడ్ రూంలో చర్చించడం కూడా తప్పే. దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెనవేసుకునే ముచ్చట్లకు ప్రాధాన్యం ఇస్తే ఇద్దరి మధ్య ఇంకా అనుబంధం ఎక్కువవుతుంది. దీంతో మనసు ప్రశాంతంగా తయారై మంచి నిద్ర మనకు స్వాగతం చెబుతుంది.