Super Star Krishna Assets: స్టార్ హీరోలలో కృష్ణ చాలా అరుదైన రకం. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కృష్ణ తాను అనుకున్నది చేశారు. నమ్మిన సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్లారు. అలాగే విలువలు ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణ డబ్బును ఏనాడూ లెక్క చేయలేదు. రెమ్యునరేషన్ పెద్ద మేటర్ గా చూసేవారు కాదు. హీరోగా తన ఫస్ట్ మూవీ తేనె మనసులు కి కృష్ణ రెమ్యూనరేషన్ రూ. 2000. 1965లో అంటే అది పెద్ద మొత్తమే అని చెప్పొచ్చు. 30 సినిమాల వరకూ కూడా కృష్ణ రూ. 5000 కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవారు కాదట.

ఒకవేళ మూవీ ప్లాపై నిర్మాత నష్టపోతే అతనికి ఫ్రీగా ఒక సినిమా చేసేవారట. అడిగినవారికి అడిగినంత ఇచ్చేసేవారట. స్నేహం పేరుతో కృష్ణ వద్ద డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వని వారు ఎందరో ఉన్నారట. అలాగే నిర్మాతగా మారి కృష్ణ చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. ఆయన నిర్మించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నప్పటికీ… కొన్ని చిత్రాలు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. ప్రయోగాల హీరోగా పేరున్న కృష్ణ ఆ తరహా చిత్రాలు తన బ్యానర్లోనే చేసేవారు.
డబ్బుపై మక్కువ లేని కృష్ణ ఆయన స్టార్ డమ్, మార్కెట్ కి ఉన్న రేంజ్ లో సంపాదించలేదు. అయినప్పటికీ పద్మాలయా స్టూడియోతో పాటు కృష్ణ పేరిట పలు స్థిర చర ఆస్తులు ఉన్నాయట. వాటి విలువ దాదాపు రూ. 400 కోట్ల వరకూ ఉంటుందట. ఈ ఆస్తి మొత్తం ఎవరికి చెందాలో వీలునామాలో కృష్ణ రాశారట. ఆయన తన మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా తన ఆస్తి చెందాలని వీలునామాలో రాశారట.

తన స్టెప్ సన్ నరేష్ కి కృష్ణ ఆస్తిలో భాగం ఇవ్వలేదని సమాచారం. అయితే నరేష్ కి తల్లి విజయనిర్మల ద్వారా పెద్ద మొత్తంలో ఆస్తి సమకూరిందట. ఆ కారణంగా నరేష్ కృష్ణ ఆస్తిలో వాటాను ఆశించలేదట. టాలీవుడ్ లో ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది. వాస్తవం ఏమిటనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో చేరిన కృష్ణ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు నవంబర్ 15 మంగళవారం ఉదయం ప్రకటించాయి.