
Basil Leaves: హిందూమతంలో తులసి మొక్కకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. ప్రతి ఇంట్లో తులసి కోట ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రతి మహిళ ఉదయం తులసి చెట్టుకు పూజ చేయడం నియమంగా పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం ప్రతి ఇంట్లో తులసి చెట్టును పెట్టుకోవడం వల్ల ఎంతో శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతుంటారు. తులసిని పూజించడంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. తులసి మొక్క మీద ఎప్పుడు పడితే అప్పుడు చేతులు వేయరాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్న సంగతి విధితమే. ఆకులు తుంచడానికి కూడా కొన్ని సమయాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు.
ఎటు వైపు పెట్టుకోవాలి
తులసి మొక్కను ఉత్తర దిశలో పెట్టుకుంటే మంచిది. ఇంకా ఈశాన్య దిశలో కూడా పెట్టుకోవడం వల్ల శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. కానీ ఇతర మార్గాల్లో పెట్టుకుంటే చెడు ఫలితాలు వస్తాయి. నైరుతి, ఆగ్నేయ, వాయువ్యం లాంటి దిశల్లో నాటుకోకూడదు. తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయాలి. లేదంటే మొక్క ఎండిపోతుంది. మొక్క ఎండిపోవడం కూడా అశుభంగానే భావిస్తారు. తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తారు. విష్ణువుకు తులసి ఆకులంటే మహాప్రీతి. అందుకే దీని ఆకులను మాలగా దేవుడికి అందజేస్తారు.
తులసి ఆకులు ఎప్పుడు తెంపాలి
తులసి ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తెంపకూడదు. దానికో సరైన సమయం ఉంటుంది. పొరపాటున కూడా తప్పుడు పద్ధతుల్లో ఆకులు తెంపితే ఇబ్బందులు వస్తాయి. తులసి ఆకులను తెంపే జాగ్రత్తలు తెలుసుకోవాలి. లేకపోతే దారిద్ర్యం పట్టుకుంటుంది. తులసి ఆకులు తెంపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గమనించుకోవాలి. స్నానం చేయకుండా తులసి ఆకులను ముట్టుకోకూడదు. తులసి చెట్టుకు నీళ్లు పోసే విషయంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని తెలుసుకుని మసలుకుంటే మంచిది.

తులసి ఆకులు ఎప్పుడు తెంచకూడదు
శుభ్రంగా స్నానం చేసిన తరువాతే ముట్టుకోవాలి. లక్ష్మీదేవిని ధ్యానం చేసి నమస్కరించి తులసి ఆకులు తెంచడానికి అనుమతి కోరాలి. అన్ని కాకుండా ఒక్కో ఆకును తెంచుకోవాలి. మాంసాహారం తిని పొరపాటున కూడా తులసి మొక్క మీద చేయి వేయకూడదు. ఇంకా ఆదివారం, ఏకాదశి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజుల్లో తులసి ఆకులను ముట్టుకోకూడదు. పొరపాటున ఈ రోజుల్లో తెంచితే మనకు నష్టాలే కలుగుతాయి. దీంతో మనం సమస్యల బారిన పడిపోతాం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
సూర్యాస్తమయం సమయంలో..
సూర్యాస్తమయం తరువాత కూడా తులసి ఆకులు తెంచరాదు. సూర్యాస్తమయం తరువాత వాటిని తెంచితే అది అశుభ్రమైనదిగా చెబుతారు. తులసి ఆకులను తెంచేటప్పుడు చేతితో తెంచాలి కానీ గోళ్లతో వాటిని తెంపకూడదు. గోళ్లతో గిల్లితే కూడా మంచిది కాదు. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. తులసి ఆకులను కొమ్మలుగా విరవకూడదు. ఒక్కో ఆకును మాత్రమే తెంపాలి. ఇలా తులసి ఆకులను తెంచే సమయంలో మనం జాగ్రత్తలు పాటించకపోతే సమస్యల వలయంలో చిక్కుకోవడం సహజమే. దీంతో వాటిని తెంచేందుకు సరైన సమయం చూసుకుని చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.