
Curry Tree Benefits: చాలా మంది కూరలో కరివేపాకును సులభంగా తీసి పక్కన పెడతారు. కానీ కరివేపాకులో ఉండే పోషకాల గురించి అలా చేస్తుంటారు. అందుకే కూరలో కరివేపాకు అని సామెత కూడా ఉంది. పప్పుకు రుచి అందించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. పప్పు ఉడికాక కరివేపాకును తీసి పక్కన పడేస్తుంటారు. ఇది సమంజసం కాదు. అందులో ఉండే ప్రొటీన్ల గురించి తెలిస్తే అలా చేయరు. విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉండటంతో కరివేపాకును తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. జీర్ణక్రియను మెరుగు పరచడంలో మలబద్ధకాన్ని నివారించడంలో కరివేపాకు సాయపడుతుంది.
కంటి చూపు మెరుగుపడటంలో..
కంటిచూపును మెరుగుపరచడంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. కరివేపాకును తరచుగా తినడం వల్ల మనకు వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు రాకుండా పోతాయి. కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఉండటంతో ఇవి ఫ్రీ రాడికల్స్ ని అరికట్టడంలో తోడ్పడుతుంది. అంతేకాదు డయాబెటిస్ ను కూడా అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరచడంలో ఇది సాయపడుతుంది. ఇందులోని ఫైటో కెమికల్స్ ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
షుగర్ లెవల్స్ తగ్గించడంలో..
ముదిరిన కరివేపాకును ప్రతిరోజు క్రమం తప్పకుండా మూడు నెలల పాటు తినడం వల్ల మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. కరివేపాకులో యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో రుజువైంది. కరివేపాకు వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి అధ్యయనాలు నిరూపించాయి. కరివేపాకు పొడి చేసి పెట్టుకుని కూరల్లో వేసుకుంటే ఆరోగ్యంతోపాటు రుచి కూడా వస్తుంది. ఇలా కరివేపాకును వివిధ రూపాల్లో తింటూ ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కరివేపాకుతో..
మునగ ఆకు తరువాత కరివేపాకుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇందులో ఉండే పోషకాలతో మనం కూరల్లో వేసుకుని తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈ నేపథ్యంలో కరివేపాకు ఉపయోగంపై ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రచురించిన అధ్యయనంలో ఈ మేరకు ఎన్నో మంచి ఫలితాలున్నాయని తేల్చింది. ఇలా కరివేపాకు వల్ల మనకు ఒనగూడే ప్రయోజనాల వల్ల దీన్ని తరచుగా ఆహారంలో చేర్చుకోవడం మంచిదే. దీనికి అందరు కరివేపాకును ఆహారంలో భాగంగా చేసుకోవడం ఆరోగ్యానికి మంచి చేకూరుస్తుంది.