Improve Focus On Study: మనలో చాలా మంది చేసే పనులు వాయిదా వేస్తుంటారు. పుస్తకం చదవాలంటే కూడా ఇష్టపడరు. స్కూలు సిలబస్ పూర్తవుతున్నా మనం మాత్రం పుస్తకాలు తెరిచిన పాపాన పోం. దీంతో చదువులో వెనకబడిపోతాం. మార్కులు సరిగా రాకపోతే తల్లిదండ్రుల నుంచి చీవాట్లే. మనకు పుస్తక పఠనం మీద శ్రద్ధ కలగాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. దీనికి గాను కొన్ని పద్ధతులు అలవాటు చేసుకుంటే మంచిది. సబ్జెక్టను పక్కన పెట్టకుండా చదవాలంటే ఏం చేయాలనే దానిపై కొన్ని నియమాలు పాటిస్తే సరి. ఐదైనా పుస్తకాన్ని చదివేటప్పుడు ఐదు నిమిషాలు చదివి మళ్లీ ఇంకో సబ్జెక్టును చదవడానికి ఇష్టపడాలి. అలా చేయడం వల్ల చదవడం మీద శ్రద్ధ ఏమాత్రం తగ్గదు.

ఒకే సబ్జెక్టును గంటల కొద్దీ చదువుతుంటే బోరు కొడుతుంది. మధ్యలో వేరు సబ్జెక్టును తీసుకుంటే మనకు బోరు అనిపించదు. కొత్త సబ్జెక్టును తీసుకోవడం వల్ల కాస్త శ్రద్ధ పెరిగి చదువు ఆపకుండా కొనసాగించే అవకాశం ఉంటుంది. విరామం ఇచ్చినప్పుడు కాస్త అటు ఇటు నడిస్తే ప్రయోజనం ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో సమయం కేటాయించుకుంటే ఎంతో మంచిది. తరగతి పుస్తకంలోని పాఠ్యాంశాలు చదువుకుంటూ ఉంటే ఒక వేళ బోరుగా అనిపిస్తే ఆడియో ద్వారా వినొచ్చు. వీడియో చూడొచ్చు. ఇలా చేయడం వల్ల కూడా మనకు కాస్త రిలీఫ్ గా ఉంటుంది.
మనం చదివే పాఠ్యాంశంలోని ముఖ్యమైన పాయింట్లను స్నేహితుల ద్వారా అడిగించుకోవాలి. దీంతో ప్రశ్నలు చెప్పేందుకు మనకు శ్రద్ధ ఎక్కువగా కలుగుతుంది. ఒకరినొకరు ప్రశ్నించుకోవడం ఆసక్తిని పెంచుతుంది. దీంతో కూడా మనకు పుస్తకం చదవడంపై అమితంగా శ్రద్ధ కలుగుతుంది. పాఠ్యాంశంలో గణాంకాలు ఉన్నా వాటిని గుర్తు పెట్టుకునేందుకు వీలుంటుంది. చవువుకునే చోటు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అవాంతరాలు కలగకుండా ఉండాలంటే అనవసర విషయాల మీద దృష్టి పెట్టకూడదు.

చదవడానికి సరైన పద్ధతులు పాటిస్తే సక్రమంగా సాగుతుంది. ఏ సబ్జెక్టుల్లో పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు వస్తాయనే దానిపై మనం దృష్టి సారిస్తే అనుకున్న ఫలితాలు వస్తాయి. చదివే సమయంలో ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి. మనం చదివే విషయం మనకు ఒంటబట్టేలా చూసుకుంటే మంచిది. లేకపోతే ఏకాగ్రత దెబ్బతింటుంది. ఫలితంగా మనం చదువుకున్న చదువు ఫలితం ఇవ్వదు. పుస్తక పఠనంతో మనకు తెలివితేటలు పెరుగుతాయి. మనకు మంచి మార్కులు సాధించాలని చాలెంజ్ గా తీసుకుని ముందుకు వెళితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.