https://oktelugu.com/

Curd: పెరుగులో వీటిని కలుపుకొని తింటే ఏం జరుగుతుందో తెలుసా?

జీర్ణక్రియకు పెరుగు మంచి ఆహార పదార్థం. అన్నం తిన్న తరువాత చివరలో పెరుగుతో కలిపి తింటే తిన్న ఆహారం సరైన క్రమంలో జీర్ణమవుతుంది. పెరుగులో కార్బో హైడ్రెట్లు, ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 16, 2023 5:50 pm
    Curd

    Curd

    Follow us on

    Curd: కొందరు కడుపునిండా ఆహారం తిన్నారని అనుకుంటారు. కానీ అది ఎంత మేలు చేస్తుందని ఆలోచించరు. నేటి కాలంలో టేస్టీ కోసం ఏవేవో ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. కానీ ఆ తరువాత అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రతిరోజూ ఎటువంటి ఆహారం తీసుకున్నా.. జీర్ణం కావడం ప్రధానం. కొన్ని ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం కావు. ఇలాంటి సమయంలో జీర్ణక్రియను సులభంగా చేసే మరికొన్ని ఆహార పదార్థాలను వాటితో తీసుకుంటే మేలు. వీటిలో పెరుగు ప్రధానం. ప్రతిరోజూ ఆహారం పెరుగు తప్పనిసరి చేసుకుంటారు కొందరు. అయితే పెరుగుతో పాటు తేనే, ఇతర పదార్థాలను కూడా కలపి తింటే కొన్ని జరిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

    జీర్ణక్రియకు పెరుగు మంచి ఆహార పదార్థం. అన్నం తిన్న తరువాత చివరలో పెరుగుతో కలిపి తింటే తిన్న ఆహారం సరైన క్రమంలో జీర్ణమవుతుంది. పెరుగులో కార్బో హైడ్రెట్లు, ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పాలు పెరుగుగా మారడానికి బాక్టిరియా సహకరిస్తుంది. ఇది పాలలో ఉండే ప్రోటీన్ ను తేలికగా అరిగేలా చేస్తుంది.పెరుగులో ఉండే మినరల్స్ రక్తంలో త్వరగా కలిసేలా చేస్తుంది. పెరుగు ఎక్కువ తిన్ని వారిలో చర్మ సంబంధిత వ్యాధులు దరి చేరవు.

    ఆరోగ్యానికి తేనె ఎంతో మేలు చేస్తుంది. పూర్వకాలంలో పంచదారకు బదులుగా తేనెను వాడేవారు. తేనెలో యాంటి సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ బి 6 ఎక్కువగా ఉంటుంది. దీనిని తరుచుగా తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగు పరచడానికి కూడా తేనెఎంతో సహకరిస్తుంది. చక్కటి నిద్ర పోవడానికి తేనే మంచి పదార్థం. రాత్రి నిద్రపోయే ముందు పాలలో తేనె కలుపుకొని తాగితే ఫలితం ఉంటుంది.

    పెరుగు, తేనెలో దాదాపు సమానమైన పోషకాలు ఉన్నాయి. వీటిని కలిపి తీసుకుంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. పెరుగులో తేనె కలుపుకొని తింటే అల్సర్ దరి చేరదు. కప్పు పెరుగులో పసుపు, అల్లం రసంతో పాటు తేనెకూడా కలిపి తినొచ్చు. పిల్లలకు తక్షణ శక్తి రావాలంటే పెరుగులోతేనె కలిపి ఇవ్వాలి.దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో నల్లమిరియాల పొడి కలిపి తింటే జీర్ణ సమస్యలు దరిచేరవు.