https://oktelugu.com/

NTR Name: ఎన్టీయార్ పేరు వెనక ఉన్న అసలు కథ ఇదే…

1983 వ సంవత్సరం లో మే 20 వ తేదీన ఎన్టీయార్ జన్మించాడు. అయితే ఒక రోజు మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ లో భాగంగా తాతా గారు అయిన సీనియర్ ఎన్టీయార్ ని చూసేందుకు అక్కడికి వెళ్లారు.

Written By:
  • Gopi
  • , Updated On : September 16, 2023 / 05:45 PM IST

    NTR Name

    Follow us on

    NTR Name: రీసెంట్ గా ప్రకటించిన సైమా అవార్డ్స్ లో జూనియర్ ఎన్టీయార్ కి ఉత్తమ నటుడుగా అవార్డు రావడం జరిగింది.రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమా లో ఎన్టీయార్ కనబరిచిన నటనకి గాను ఆయనకి ఉత్తమ నటుడు గా అవార్డు ఇవ్వడం జరిగింది.నిజానికి ఈయన చేసిన కొమరం భీం పాత్ర లో ఒక ఎమోషన్ ఉంటుంది దాన్ని ఎన్టీయార్ చాలా బాగా పెర్ఫామ్ చేసాడు. అందుకే ఎన్టీయార్ కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అలాగే కొమరం భీముడొ అనే సాంగ్ లో కూడా సూపర్ గా నటించి మెప్పించాడు.

    అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ రీసెంట్ గా ఎన్టీయార్ పేరు మీద చాలా రకలైన విమర్శలు వస్తున్నాయి. టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా అరెస్ట్ అయినా విషయం మన అందరికి తెలిసిందే… ఆయన అరెస్ట్ అయ్యాక ఆయన్ని కలవడానికి చాలా మంది ప్రముఖులు రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్లి ఆయన్ని కలుస్తూ ఉంటె జూనియర్ ఎన్టీయార్ మాత్రం ఆయన అరెస్ట్ గురించి అసలు ఎలాంటి మాట మాట్లాడలేదు కనీసం తన ట్వీటర్ లో ఒక ట్విట్ కూడా చేయలేదు.దాంతో తెలుగు దేశం కార్య కర్తలు అందరు కూడా ఎన్టీయార్ మీద కోపం తో ఆ ఎన్టీయర్ అనే పేరు తీసి వేసి ని సొంత పేరు పెట్టుకో అంటూ పెద్ద ఎత్తున ఎన్టీయార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు…అసలు ఎన్టీయార్ అసలు పేరు ఏంటి ఆయనకి ఎన్టీయార్ అనే పేరు ఎవరు పెట్టారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

    1983 వ సంవత్సరం లో మే 20 వ తేదీన ఎన్టీయార్ జన్మించాడు. అయితే ఒక రోజు మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ లో భాగంగా తాతా గారు అయిన సీనియర్ ఎన్టీయార్ ని చూసేందుకు అక్కడికి వెళ్లారు. అక్కడ జూనియర్ ఎన్టీయార్ ని చూసి పెద్దాయన పిలిచి పక్కనే ఉన్న మేకప్ మ్యాన్ తో చెప్పి ఆయనకి మేకప్ వేయించారు. ఇక మేకప్ వేసిన తర్వాత జూనియర్ ఎన్టీయార్ ని పెద్దాయన చూసి చాలా ముచ్చట పడి పెద్దయ్యాక ఇండస్ట్రీ ని దున్నేస్తావ్ అని కితాబు ఇచ్చారు.ఇక తన ముందుగా బ్రహ్మర్షి విశ్వ మిత్ర సినిమాలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్ కి తెలిపారు..అలా కొద్దీ రోజుల పాటు ఆయనతోనే ఉంటే తారక్ ఆయన దగ్గర యాక్టింగ్ లో మెళుకువలు కూడా నేర్చుకున్నారు…

    ఇక ఆ తర్వాత తారక్ బాలా రామాయణం అనే సినిమా కూడా చేసాడు.అయితే ఒకరోజు తారక్ కి పెద్దాయనని కలవమని పిలుపు రావడం తో కలవాలని ఆయన ఉండే ప్లేస్ కి వెళ్ళాడు తారక్… అప్పుడు పెద్దాయన తారక్ ని పిలిచి నీ పేరు ఏంటి అని అడిగితే అప్పుడు తారక్ నా పేరు తారక్ రామ్ అని చెప్పాడు. దానితో అక్కడే ఉన్న హరికృష్ణ ని పిలిచి వీడి పేరు తారక రామారావు అని పెట్టండి అని చెప్పడం తో అప్పటి నుంచి తారక రామ్ గా ఉన్న ఆయన పేరు నందమూరి తారక రామారావు గా మారింది…ఇక తారక్ కి వీలు దొరికినప్పుడల్లా పెద్ద ఎన్టీయార్ దగ్గరకి వెళ్లి పెద్దాయనతో ఎక్కువ సేపు గడిపేవారట..ఇక జూనియర్ ఎన్టీయార్ కి వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టం, ఆమె అంటే ప్రాణం అని కూడా ఎన్టీయార్ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ల నాన్న హరికృష్ణ అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం ఆయన రోడ్ ప్రమాదం లో చనిపోయినపుడు కూడా ఎన్టీయార్ చాలా ఎమోషనల్ అవ్వడం మనం చూసాం…అయితే అప్పటి నుంచి ఎన్టీయార్ ఏ సినిమా ఫంక్షన్ కి వచ్చిన అభిమానులని క్షేమంగా ఇంటికి వెళ్లాలని చెప్తూ ఉంటారు…ఇక అందుకే అభిమానులే నా కుటుంబం వాళ్లే నా ప్రాణం, వాళ్లే నా బలం, నా బలగం అంటూ చాలా సార్లు చెప్పాడు…