Index finger longer than thumb: పురాణంలో కొన్ని చెప్పబడిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఆ విషయాలు నేటికీ కొందరు పాటిస్తున్నారని ఆధ్యాత్మిక వాదులు.. వాస్తు శాస్త్ర నిపుణులు.. జ్యోతిష్య పండితులు చెబుతూ ఉంటారు. మానవ జీవితానికి సంబంధించిన ఈ విషయాలు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయని.. మరికొన్ని గురించి తెలుసుకుంటే ముందు జాగ్రత్తతో ఉండవచ్చని అంటూ ఉంటారు. అయితే వీటిలో ఒక విషయం గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేంటంటే బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దదిగా ఉంటే ఏం జరుగుతుందో కొంతమందికి తెలుసు. ఎందుకంటే కొన్ని సినిమాల్లో చూపించిన ప్రకారం బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దదిగా ఉండేవారు వారి భార్య లేదా భర్త పై పెత్తనం చెలాయిస్తారు. కానీ ఇలా వేలు ఉండడం వల్ల మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అది ఏంటంటే?
మనం కొన్ని దేవుళ్ళ ఫోటోలను చూస్తూ ఉంటే.. ఇందులో బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దదిగా ఉన్న దేవతలు లేదా దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు. అంటే చాలావరకు మహాత్ములు లేదా గొప్పవారు అందరూ ఇలా బొటన వేలు కంటే పక్కనే వేలు పెద్దదిగా కలిగి ఉంటారు. అంటే బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దదిగా ఉన్నవారు ఆడవారు మాత్రమే కాకుండా.. మగవారు ఎవరైనా గొప్పవారుగా మారుతారని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది.
ఇలా బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దదిగా ఉన్నవారు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానిని పూర్తిచేసే వరకు వదలరు. ఎవరి మాట వినకుండా మొండిగా వ్యవహరిస్తారు. అయితే చాలా వరకు వీరు చేసే పనుల్లో న్యాయం ఉంటుంది. కొందరు తమ మాటల ద్వారా వీరిని మార్చాలని అనుకుంటే అస్సలు సాధ్యం కాదు. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా జీవించాలని అనుకుంటారు. ముఖ్యంగా ఆత్మ అభిమానం పై ఎక్కువగా నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారు. అలాగే ఈ రకమైన వేలును కలిగి ఉన్నవారు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపులు తెచ్చుకుంటారు. ప్రత్యేక రంగాల్లో వీరు తమదైన శైలిని చూపించి విజేతగా నిలుస్తారు.అలాగే ఇలాంటి వేలు ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ఎదుటివారికి సహాయం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే ఇందులో కూడా కొంత స్వార్థం కూడా చూస్తారు. ఏ పని అయినా చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకొని విజయవంతంగా పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు.
చాలామంది ఆడవారికి ఇలా వేలు పెద్దదిగా ఉన్నవారు తమ భర్తలపై పెత్తనం చూపిస్తారని అంటారు. వాస్తవానికి వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వారు చేసే మంచి పనికి ఎవరు అడ్డు రాకుండా ఉండాలని అనుకుంటారు. అయితే కొందరు భర్తలకు ఇది నచ్చదు. దీంతో వారు తమపై పెత్తనం అని అనుకుంటారు. అయితే ఇలాంటి సమయంలో వారిని సంయమనం గా ఉండి వారితో మంచిగా ప్రవర్తిస్తే కలిసిమెలిసి ఉంటారు. అంతేకాకుండా వేలు పెద్దదిగా ఉన్న ఆడవారు తమ కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది మగవారికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. అందువల్ల ఇలాంటి వారిపై ఎప్పుడు కోప్పడకుండా వారితో మంచిగా ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.