Generic Medicine: సాధారణంగా వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడే మూల పదార్థాన్ని జనరిక్ అంటారు. అన్ని రకాల మందులు ఇలాంటి ఫార్ములాతో తయారవుతాయి. కంపెనీలు తయారు చేస్తే బ్రాండెడ్ అని కంపెనీల పేరు లేకుండా చేస్తే జనరిక్ మందులని పిలుస్తారు. జనరిక్ మందులకు తక్కువ ధర ఉంటుంది. ప్రస్తుతం అన్ని రకాల జబ్బులకు మార్కెట్ లో జనరిక్ మందులు లభిస్తున్నాయి. కానీ అవి బ్రాండెడ్ కాదనే చిన్న కారణంతోనే జనరిక్ మందులను వాడటానికి వెనకాడుతున్నారు.

ఇతర మందులకు జనరిక్ మందులకు ధరల్లో భారీ తేడా ఉంటుంది. వీటి మధ్య వ్యత్సాం 30 నుంచి 80 శాతం వరకు ఉండటంతో జనరిక్ మందులకు గుర్తింపు దక్కడం లేదు. ధర తక్కువ అయినంత మాత్రాన వాటి విలువ తక్కువ కాదు. ఖరీదైన బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు కూడా వాటితో సమానంగా పనిచేస్తాయి. జనరిక్ మందులు తీసుకోవాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే. కానీ జనరిక్ మందుల వాడకంతో రోగాలు నయం కావడం సహజమే.
జనరిక్ మందులు కొనుగోలు చేసేటప్పుడు వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. లేకపోతే సరైన మందులు వాడకపోతే నష్టమే. వేరువేరు మందులకు వేరు మాత్రలు వాడితే ఇబ్బందులు తలెత్తుతాయి. డాక్టర్ ప్రిస్ట్కిప్షన్ అర్థమయ్యేలా ఉందా లేదా అనే విషయాలు షాపులో ఉన్న వారు కూడా గుర్తించాలి. లేదంటే కష్టాలు వస్తాయి. తగిన అర్హతలు కలిగిన వారు ఉంటేనే మనకు మందుల గుర్తింపులో అడ్డంకులు తలెత్తవు. తక్కువ ఖర్చుతో రోగాలను నయం చేసుకోవాలనుకునే వారికి జనరిక్ మందులు ఎంతో ఉపకరిస్తాయి.

కంపెనీల మందులు కాకుండా జనరిక్ మందులు వాడితేనే ధర తక్కువ ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. దీనికి వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలు రావు. మందులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో జనరిక్ మందుల వాడకం తప్పనిసరి చేసుకోవాలి. లేకపోతే కంపెనీ మందులు వాడినా జనరిక్ మందులు వాడినా ఒకే రకమైన ప్రయోజనం ఉంటుందని తెలియకపోవడంతో కంపెనీల మందులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో జనరిక్ మందుల వాడకానికి ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది.