Dengue Food: ప్రస్తుతం వ్యాధుల కాలం. దోమల కాటు వల్ల మలేరియా, ఫైలేరియా, డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయి. దీంతో మనుషుల ప్రాణాలే ప్రమాదంలో పడుతున్నాయి. డెంగీ బారిన పడితే ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. రక్తకణాలు తగ్గితే ప్లేట్ లెట్స్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా మన ప్రాణాలే గాల్లో కలిసిపోయే సూచనలు ఉంటాయి. డెంగీ జ్వరం సోకితే చికిత్స తప్పనిసరి. వైరస్ లు వృద్ధి చెందకుండా చూసుకోవాలి.

డెంగ్యూ బారిన పడితే ఇబ్బందులు ఏర్పడవచ్చు. రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సెలెనియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వైరస్ లు వృద్ధి చెందకుండా చూస్తుంది. డెంగీ రోగులకు ఈ వ్యవస్థ పనిచేయదు. దీంతో ప్రాణాలకు ముప్పు కలుగుతుంది. డెంగీ సోకితే మేక పాలు బాగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది. బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి పండును తీసుకుంటే కూడా ప్లేట్ లెట్లు పెరుగుతాయి.
దీంతో డెంగీ పేషెంట్లు వీటిని క్రమం తప్పకుండా తీసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.వేప ఆకులతో కూడా డెంగీ బాధితులకు ఎన్నో లాభాలున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. డెంగీకి చికిత్సలో వేప ఆకులు సాయపడతాయి. వీటి ఆకుల రసం తీసుకుని తాగితే రోగం దూరం అవుతుంది. కొబ్బరి నీళ్లు కూడా డెంగీని నివారిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు ఎంతో దోహదపడతాయి. డెంగీని దూరం చేసుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమతెరలు వాడుకోవాలి. డెంగీ బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటేనే ప్రయోజనం.డెంగీ బారిన పడకుండా చూసుకోవాలి.

బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ తాగితే కూడా ఫలితం ఉంటుంది. త్వరగా ప్లేట్ లెట్లు పెరగడానికి దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో డెంగీని తట్టుకునే ఇమ్యూనిటీ సంపాదించుకోవాలి. అప్పుడే డెంగీ బారి నుంచి రక్షించుకుని హాయిగా జీవితం గడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో డెంగీ జ్వరం సోకకుండా అప్రమత్తంగా ఉండాలి. మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అప్పుడే మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండొచ్చు.