Teaching Jobs: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. రాయ్ పూర్ లో ఉన్న ఎయిమ్స్ లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లో ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆ హార్డ్ కాపీలను ఎయిమ్స్ సంస్థ రాయ్ పూర్ అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 2,20,000 రూపాయలు వేతనంగా లభించే అవకాశం ఉంటుంది. ఇతర ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 1,42,506 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు వేతనంగా లభిస్తుంది.
https://www.aiimsraipur.edu.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
Also Read: ఏపీలో డిగ్రీ పాసైన మహిళలకు శుభవార్త.. రూ.71,500 వేతనంతో?
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో?