Famous dishes : కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల ఆహారాలు చాలా ఫేమస్ అవుతాయి. వాటిని తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. ఇదే విధంగా కొన్ని ప్రాంతాల్లో వారికి సంబంధించిన ప్రత్యేకమైన వంటకం ఫేమస్ అవుతుంది. అందుకే ఏ ప్రాంతానికి వెళ్లినా సరే ఆ ప్రాంతంలో ఉండే స్పెషల్ వంటకాన్ని రుచి చూడాలి అంటారు. మరి మన దేశంలో ఉన్న నగరాలు, ఆ నగరాల్లో ఫేమస్ అయిన వంటకాల గురించి ఓ సారి తెలుసుకుందామా? మీరు ఎప్పుడైనా వెళ్తే కచ్చితంగా ఓ సారి ట్రై చేయండి.
భారతదేశ వైవిధ్యం ఆహారంలో ప్రతిబింబిస్తుంది. ఇక కొన్ని నగరాలు కూడా అదే విధంగా ఆ ప్రాంత వైవిద్యాన్ని ప్రతిబింబించేలా చేస్తాయి. అలాంటి కొన్ని వంటకాల గురించి తెలుసుకుందాం. వడా పావ్.. ఈ పేరు వినగానే ముందుగా మీకు ఏం గుర్తు వచ్చింది. మహారాష్ట్ర కదా. అవును ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన రోడ్డు పక్కన ఆహారం ఈ వడాపావ్. ప్రాథమికంగా ఒక పావ్‌లో శాండ్‌విచ్ చేస్తారు. ఆలుతో చేస్తారు. ఇక చట్నీని కలిపి తింటే ఈ మసాలా వడలు అద్భుతంగా అనిపిస్తాయి.
క్రీముతో కూడిన బటర్ చికెన్‌ను తినకుండా ఢిల్లీ నుంచి తిరిగి రావద్దు. ఈ డిష్ ఉత్తర భారతీయ వంటకంగా ప్రసిద్ధి చెందింది. ఇక బీహార్‌లోని అత్యంత ప్రసిద్ధ వంటకాలలో ఒకటైన లిట్టి చోఖా కచ్చితంగా తినాలి. గోధుమ పిండి తో లడ్డూలా చేసి అందులో మసాలా సత్తును నింపుతారు. మంచి వంకాయ కర్రీతో వడ్డిస్తారు, దీనిని చోఖా అని అంటారు. ఇక ఐకానిక్ తాజ్ మహల్ ఉన్న ఆగ్రా లో పేటా, కాల్చిన పాల స్వీట్‌మీట్‌కు ప్రసిద్ధి చెందింది. లక్నో గాస్ట్రోనమిక్ ఆకర్షణ మెల్ట్-ఇన్-మౌత్ గలౌటీ కబాబ్ మంచి టేస్ట్ ను అందిస్తుంది. ఇది నాన్ వెజ్ ఐటమ్.
అహ్మదాబాద్ లో మెత్తటి ధోక్లా ను తినడానికి ఇష్టపడతారు. బియ్యం, చిక్‌పా పిండితో తయారు చేస్తారు. పులియబెట్టిన ఆవిరితో కూడిన కేక్ ఇది. చాలా రుచికరంగా ఉంటుంది. జైపూర్ పాక వారసత్వం దాల్ బాటి చుర్మాతో నోరు ఊరిస్తుంటుంది. ఇది కాయధాన్యాలు, గోధుమలు, కుడుములు, తీపి మెత్తని మిశ్రమంతో కూడిన రాజస్థానీ వంటకం. మీరు ఎప్పుడైనా ఆ వైపుకు వెళ్తే కాస్త రుచి చేసేయండి.
బెంగళూరులో సిగ్నేచర్ డిష్ ఆరోగ్యకరమైన, సువాసనగల బిసి బేలే బాత్ ప్రసిద్ధి చెందింది. ఇది కూరగాయలతో కూడిన స్పైసీ రైస్, పప్పు వంటకం దీన్ని అక్కడ చాలా మంది ఇష్టంగా తింటారు. కోల్‌కతాలో స్పాంజి రోసోగొల్లాలు తినకుండా ఎవరు రిటర్న్ కారేమో. అంత ప్రసిద్ధి చెందింది ఈ రసగుల్లా. ఇది కాటేజ్ చీజ్‌తో చేసిన నోరూరించే బెంగాలీ స్వీట్ అనడంలో సందేహం లేదు. ఇక చెన్నై మంచి సువాసనగల మసాలా దోసకు ప్రసిద్ధి చెందింది. ఇది మసాలా బంగాళాదుంపలతో నిండిన రైస్ క్రేప్. అన్నింటి గురించి చెప్పారు. కానీ హైదరాబాద్ అనుకుంటున్నారా? ఈ నగరానికి వచ్చిన చాలా మంది మన హైదరాబాదీ బిర్యానీ తినకుండా వెళ్తారా? ఇది చాలా ఫేమస్ గురు.