Gods : ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని ఎంత చెప్పినా కొందరు బేఖాతరు చేస్తుంటారు. చెప్పినా వినకుండా వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. చలాన్లు వేస్తున్నా సరే డబ్బులు కడుతున్నారు కానీ ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోవడం లేదు. అందుకే ఇలాంటి వారి కోసం కొందరు అధికారులు, సంస్థలు ఎన్నో విధాలుగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు పోలీసులు మంచి మంచి వీడియోలతో వారికి అవైర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.
ప్రతి రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరగడం, గాయాలు అవ్వడం, ప్రాణాలు పోవడం కామన్ గా జరుగుతున్నాయి. మెజారిటీ రోడ్డు ప్రమాదాల్లో వ్యక్తులు చేసే తప్పులు ఎక్కువ కనిపిస్తాయి. తెలిసో తెలియకో మిస్టేక్స్ చేస్తున్నారు. దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే వాహనాలు నడుపుతుంటే పక్కా జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. ఆరోగ్యం కాపాడుకోవాలి. పాటించని వారికి జరిమానాలు కూడా విధించడం కూడా కామన్. అయినా సరే ట్రాఫిక్ రూల్స్ ను లైట్ తీసుకుంటారు.
ప్రమాదాలు జరిగే సమయంలో మనిషి ప్రాణాలను రక్షించడానికి హెల్మెట్‌ల చాలా కీలక పాత్ర పోషిస్తుంది. హెల్మెట్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడుకుంటున్నారు. కొందరు ప్రాణాలు వదులుతున్నారు. అయితే చాలా మంది హెయిర్ స్టైల్ పాడవుతుందని, వేడిగా ఉంటుందని అనవసరమైన సాకులు చెప్పుకుంటూ హెల్మెట్ ను లైట్ తీసుకుంటున్నారు. హెల్మెట్ పెట్టుకోవడం కూడా నచ్చదు వారికి. కానీ మీకు హెల్మెట్ ప్రాముఖ్యత తెలుసా? ఓన్లీ మానవులు మాత్రమే కాదు దేవుళ్లు కూడా రక్షణగా వాడుతుంటారు అనేట్టుగా తెలిపే ఓ వీడియో చూస్తే హెల్మెట్ ఎంత అవసరమో మీకే అర్థం అవుతుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటో ఆ సారి లుక్ వేయండి.
హెల్మెట్ ప్రాముఖ్యత ఎలాంటిదో అని చెప్పే ఓ ప్రకటనకు సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియో అందరినీ ఆలోజింప చేస్తోంది. నిజానికి ఈ యాడ్ వీడియో పాతదే. కానీ తాజాగా మళ్లీ ఇందుకు సంబంధించి రీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఆ వీడియోలో ఉన్న ప్రత్యేకత ఏంటో ఓ సారి చూసేద్దాం.
దుర్గామాత, వినాయకుడు, మహావిష్ణువు ఈ వీడియోలో ప్రదానంగా కనిపిస్తారు. వీరు ఎక్కడికో వెళ్లడానికి తమ తమ వాహనాలనైన సింహం, గరుడ పక్షి, ఎలుకపై ఎక్కడం వీడియోలో చూడవచ్చు. అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటారు ఈ దేవుళ్లు. అయితే ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత ఒక్కసారిగా ఆగి తమ కిరీటాలను ధరించడం చూడవచ్చు. మీకు అర్థం అయిందా? ఇక్కడ కిరీటం అంటే హెల్మెట్ అని అర్థం. ‘మిమ్మల్ని రక్షించే దేవుళ్లు కూడా వారి తలలను కాపాడుకోవడానికి హెల్మెట్ (కిరీటం) వాడుతున్నారు అనే విధంగా ఉంది. అందుకే మీరు కూడా మీ తలను హెల్మెట్‌తో భద్రంగా చూసుకోవాలి అనే కొటేషన్ భలే ఉంది కదా. ఇక హెల్మెట్ ప్రాముఖ్యతను సింపుల్‌గా 54 సెకండ్ల నిడివి వీడియోలో తెలిపారు.