SUV Electric: Mahindra కార్లకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీ కార్ల ధరలు కాస్త ఎక్కువగా ఉన్నా.. నాణ్యత విషయంలో రాజీ పడబోమని కంపెనీ ప్రతినిధులు చెబుతూ ఉంటారు. అయినా ఈ కార్లను ఎగబడి కొంటూ ఉంటారు. అందుకు ఉదాహరణకు గత ఏడాదిలో మార్కెట్లోకి వచ్చి మహీంద్రా థార్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. అయితే థార్ 4 నుంచి 5 సీటర్ గా అలరిస్తుంది. కానీ ఇదే కంపెనీకి చెందిన 7 సీటర్ కారు ఎలక్ట్రిక్ కారు బెస్ట్ మైలేజ్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. పెద్ద ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్త 500 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంతకీ ఆ కారు ఏది? ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి?
ఆటోమోబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. టాట, హ్యుందాయ్ కంపెనీలు ఇప్పటికే చాలా ఈవీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. గత నెలలో మారుతి కంపెనీ సైతం గ్రాండ్ విటారా ఈవీని ప్రదర్శించింది. అయితే మహీంద్రా కంపెనీ సైతం ఇప్పటికే చాలా వరకు ఎలక్ట్రిక్ కార్లను వినియోగదారులకు అందించింది. తాజాగా XUV700 SUV మోడల్ కు చెందిన XEV 7e ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధం చేస్తోంది. దీని డిజైన్ వినియోగాదారులను ఆకట్టుకునే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
ముఖ్యంగా ఈ కారులో లేటేస్ట్ ఫీచర్లు ఉంటాయని కంపెనీ హింట్ ఇచ్చింది. ఇందులో ఎల్ఈడీ ల్యాంప్స్, ఆకర్షణీయమైన బంపర్లు ఉంటాయి. అలాగే అల్లాయ్ వీల్స్ ఏరో ఇన్సర్ట్ లతో కలిపి ఉంటాయి. మూడు వరుసల సీట్లు కలిగిన ఇందులో బిగ్ టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు ఆటోమేటిక్ క్లైమేటజ్ కంట్రోల్, పవర్డ్ టెయిల్ గేట్ వంటి ఇన్నర్ ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు అందరూ కోరుకుంటున్న పనోరమిక్ సన్ రూప్ ను కూడా ఇందులో అమర్చారు.
ఈ కారులో రెండు బ్యాటరీలను అమర్చనున్నారు. వీటిలో ఒకటి 79 కిలో వాట్ ను కలిగి ఉండగా.. మరొకటి 59 కిలోవాట్ ను కలిగి ఉంటుంది. మొదటి బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో సేప్టీ ఫీచర్స్ ఆకట్టుకుంటాయి. ఇందులో 2 అడాస్ టెక్నాలజీని కలిగి ఉంది. అలాగే 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు సేప్టీలో బెస్ట్ అనిపించుకుంటుంది.
సాధారణంగా కార్ల ధర విషయంలో మహీంద్రా కంపెనీ కాంప్రమైజ్ కాకుండా ఉంటుంది. కానీ XUV700 SUV ఎలక్ట్రిక్ కారును తక్కువ ధరకే అందించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని 2025 మధ్య భాగంలో లేదా ఈ ఏడాది చివరిలో మార్కెట్లోకి తీసుకురానున్నాయి. అంతేకాకుండా BE 6కార్లను వినియోగదారులు ఎక్కువగా కోరుకుంటున్న సమయంలో మహీంద్రా నుంచి ఈ కారు మార్కెట్లోకి తీసుకురావడంతో చాలా మంది దీనిని కొనుగోలు చేస్తారని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.