Credit Card: క్రెడిట్ కార్డు గురించి ఈ సీక్రెట్ గురించి తెలుసా? రూ.40 లక్షల వరకు బెనిఫిట్..

క్రెడిట్ కార్డు బిల్లు కట్టమని కొన్ని బ్యాంకులు ఫోర్స్ చేస్తుంటాయి. ఈ బిల్లులు చెల్లించలేక చాలా మంది అవస్థలు పడుతుంటారు. అయితే కొందరు క్రెడిట్ కార్డులు కలిగి ఉన్న వారు చనిపోతే వారి కుటుంబ సభ్యులను బిల్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తారు.

Written By: Srinivas, Updated On : January 20, 2024 6:52 pm

Credit Cards

Follow us on

Credit Card: నేటి కాలంలో ఉద్యోగం, వ్యాపారం చేసే ప్రతి ఒక్కరి దగ్గర దాదాపు క్రెడిట్ కార్డు ఉంటోంది. వస్తు సేవల కొనుగోలుతో పాటు, రుణం తీసుకోవడానికి క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. వినియోగదారుల ట్రాన్సాక్షన్ బట్టి కొన్ని బ్యాంకులు ఎలాంటి చార్జీలు విధించకుండా ఉచితంగా కార్డులు జారీ చేస్తున్నాయి. ఈ కార్డులను వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డు వాడినప్పుడు బాగానే ఉంటుంది. కానీ బిల్లు చెల్లించేటప్పుడు మాత్రం ఆందోళనగా ఉంటుంది. కొందరు ఈ బిల్లును చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దీంతో ఈ బిల్లుపై వడ్డీపై వడ్డీ పడి భారంగా తయారవుతుంది.

క్రెడిట్ కార్డు బిల్లు కట్టమని కొన్ని బ్యాంకులు ఫోర్స్ చేస్తుంటాయి. ఈ బిల్లులు చెల్లించలేక చాలా మంది అవస్థలు పడుతుంటారు. అయితే కొందరు క్రెడిట్ కార్డులు కలిగి ఉన్న వారు చనిపోతే వారి కుటుంబ సభ్యులను బిల్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తారు. దీంతో వారు సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఈ బిల్లు భారం కుటుంబ సభ్యలపై పడకుండా ఓ మార్గం ఉంది. అదే క్రెడిట్ కార్డు ఇన్సూరెన్స్. ఇప్పటి వరకు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి విన్నాం. కానీ క్రెడిట్ కార్డు ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

క్రెడిట్ కార్డు జారీ అయినప్పుడు కొన్ని పేపర్స్ ఇస్తుంటారు. 80 శాతం మంది ఈ పేపర్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. క్రెడిట్ కార్డు రాగానే పిన్ జనరేట్ చేసుకొని వాడుతూ ఉంటారు. అయితే ఈ పేపర్స్ లో వెనకాల చిన్న అక్షరాలతో క్రెడిట్ కార్డు ఇన్సూరెన్స్ గురించి ఉంటుంది. క్రెడిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఈ కార్డు ఉన్న వారు రోడ్డు ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. బస్సులో చనిపోతే రూ.5 నుంచి రూ.10 లక్షలు, విమానంలో చనిపోతే రూ.40 నుంచి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది.

క్రెడిట్ కార్డు పై ఇన్సూరెన్స్ ఉంటుందన్న విషయం బ్యాంకు వారికి కూడా తెలుసు. కానీ ఆ విషయం చెప్పరు. ఎందుకంటే దీని వల్ల క్రెడిట్ కార్డు ఉన్న వారికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఈ కార్డు ఉన్న వారు ప్రమాదంలో చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులను వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అందిస్తారు. అందువల్ల ఈ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని క్రెడిట్ కార్డు ఉన్నవారు ఉపయోగించుకోవచ్చు.