Erectile Dysfunction: ఇటీవల కాలంలో అంగస్తంభన సమస్యలు వేధిస్తున్నాయి. మగాళ్ల పురుషాంగం తగిన విధంగా స్పందించకపోతే దాన్ని అంగస్తంభన సమస్యగా చెబుతారు. లైంగిక సంపర్కంలో ఇబ్బందులు ఎదురైతే తృప్తి కలగదు. ఒకటి రెండు సార్లు కాకుండా పదేపదే జరిగితే ఆందోళన చెందుతారు. తమ సమస్యకు పరిష్కారం కోసం వైద్యులను సంప్రదించాల్సిందే. లేదంటే సమస్య మరింత ముదిరితే జీవిత భాగస్వామికి అసంతృప్తి మిగులుతుంది. ఈ నేపథ్యంలో అంగస్తంభన సమస్యకు పలు కారణాలు ఉన్నాయని తెలుసుకోవాలి.

అంగస్తంభన సమస్య ఏర్పడటానికి గల కారణాలు అన్వేషించాలి. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. కొవ్వు తగ్గించుకుంటే ఈ ముప్పు తగ్గుతుంది. కానీ ఎవరు కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అధిక కొవ్వు ఇచ్చే ఆహారాలను తగ్గించుకోవడం లేదు. ఫలితంగానే అంగస్తంభన సమస్య ఏర్పడుతోంది. పురుషాంగానికి రక్తసరఫరా తగ్గితే అంగం స్తంభించదు. దీంతో అంగస్తంభన సమస్య వేధిస్తుంది. ఈ సమస్య తరచుగా ఎదురైతే ఇబ్బందులు రావడం సహజమే. వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది.
పురుషాంగంలోని నరాలు, నాళాలకు రక్తసరఫరా కాకపోతే అంగం స్తంభించకుండా పోతుంది. దీని వల్ల మనకు దీర్ఘకాలికంగా ఈ సమస్య ఎదురైతే అసంతృప్తి మరింత పెరిగిపోతుంది. మన ఆహార అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యపానం, ధూమపానం తీసుకోకూడదు. ఇతర మాదక ద్రవ్యాలు వంటి వాటి జోలికి వెళ్లకూడదు. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. మాంసం, వెన్న, నెయ్యి, ఐస్ క్రీములు, కేకులు, బిస్కెట్లు వంటివి తినకూడదు.

పండ్లు, కూరగాయలు, గింజలు, రొట్టెలు, బ్రౌన్ రైస్ వంటి ఆహారాలు తీసుకోవడం మంచిది. అంగస్తంభన సమస్య దూరం చేసుకోవడానికి వయాగ్రా కూడా తీసుకుంటారు. పురుషాంగంలో రక్తనాళాలు సరిగా పనిచేయాలంటే రక్తప్రవాహం పెరిగేలా చేయాలి. అంగస్తంభన సమస్య దూరం కావడానికి పలు చర్యలు తీసుకోవాల్సిందే. అంగస్తంభన ఇబ్బందులు లేకుండా చేసుకోవడానికి సరైన మార్పులు చేసుకోవడం ఉత్తమం. ఇలా ఈ సమస్యను రాకుండా చేసుకోవడానికి పలు మార్గాల్లో ప్రయత్నించాలి.