Divorce: ఇటీవల కాలంలో విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. చిన్నమనస్పర్దల కారణంగానే విడాకుల వరకు వెళ్తున్నారు. భార్యాభర్తల బంధంలో విడాకులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఆలుమగల్లో విడాకులు తీసుకోవడానికి పలు కారణాలు చెబుతున్నారు. దంపతులు చిన్న విషయాలనే పెద్దగా ఫోకస్ చేసి చూస్తున్నారు. విడిపోవడానికి వారు చెబుతున్నవి అంత పెద్దవేమీ కాదు. కానీ వాటిని సులభంగా పరిష్కరించుకోవాల్సి ఉన్నా విడాకులకు ఎందుకు మొగ్గు చూపుతున్నారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల బంధం ఎందుకు పాడవుతుందనే వాటిపై వారు చెప్పే కారణాలు ఇవే.

విడాకులు తీసుకున్న వారిని ప్రశ్నిస్తే కొందరు తమ భార్య తమను మోసం చేసిందని అందుకే విడాకులు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. నా భార్య మోసం చేసినట్లు రుజువులు కూడా ఉండటంతో ఇక ఆమెతో ఉండటం ఇష్టం లేక విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. ఏడాది కాలం ఆమె మారుతుందని చూశా. కానీ ఆమెలో మార్పు రాలేదు. తన పద్ధతి మార్చుకోలేదు. అందుకే డైవర్స్ తీసుకున్నానని చెప్పడం గమనార్హం. ఇలా చిన్న గొడవలనే పెద్దవిగా చూస్తూ విడాకులు తీసుకునే వరకు వెళ్తున్నారు.
భార్య మానసిక ప్రవర్తన కారణంగా కూడా విడాకులు తీసుకుంటున్నారు. ప్రతి విషయానికి మొగుడిపై అనుమానం. ఎక్కడికెళ్లావు. ఏం చేస్తున్నావని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. అందువల్లే డైవర్స్ తీసుకున్నానని చెబుతున్నారు. ఇంటికి ఆలస్యంగా వచ్చినా డౌటే. ఆరాలు తీయడం నిత్యం వేధింపులకు గురిచేయడం చేస్తుంటే ఇక కుదరదని విడాకులు తీసుకుంటున్నారు. ఆమె పెడుతున్న టార్చర్ భరించలేకనే విడాకుల వరకు వెళ్తున్నారు.

ఇతర మతాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటే కూడా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. మొదట్లో సంసారం సజావుగా సాగినా తరువాత ఆమె తల్లిదండ్రులు మతం మారమని షరతులు పెడుతున్నారు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో దూరం పెరుగుతోంది. ప్రతి విషయంలో తన మాట నెగ్గాలనే వాదన పెరడంతో ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో భర్తలు ఇబ్బందులు పడుతున్నారు. మద్యపానం కూడా వారిలో దూరం పెంచుతోంది. మద్యం తాగేవారిని భార్యలు దగ్గరకు రానీయడం లేదు. దీంతో ఆమెకు విడాకులు ఇస్తున్నారు.