Not Feeling Hungry: మన శరీరంలో జరిగే మార్పులు మనకు ఎన్నో సూచనలు చేస్తాయి. కానీ వాటిని మనం పట్టించుకోం. మన శరీరం ఎన్నో సంకేతాలు ఇస్తుంది. ఈ నేపథ్యంలో మనకు ఆకలి వేయకుండా పోతుందంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చిన్న చిన్న విషయాలే మనకు పెద్ద నష్టాలు కలిగిస్తాయి. ఆకలి మందగించడం వల్ల మనకు ఇబ్బందులు వస్తాయి. కడుపు ఖాళీగా ఉంటే గ్యాస్ సమస్యలు వేధిస్తాయి. ఆకలిగా లేనప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఆకలి లేమి సమస్య నుంచి దూరం కావచ్చు.

రోజు మనం తీసుకునే ఆహారమే మనకు శక్తి నిస్తుంది. కొంతమందికి అసలు ఆకలి వేయదు. దీని వల్ల మరింత బలహీనంగా మారుతారు. ఆకలి లేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒత్తిడితో కూడా మన ఆరోగ్యం దారి మారుతుంది. దీంతో కూడా ఆకలి వేయదు. కేంద్ర నాడీ వ్యవస్థ జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. ఆందోళన, ఒత్తిడి, నిరాశ కూడా ఆకలి వేయకుండా చేస్తాయి. ఆకలిని దూరం చేసుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఆకలి సమస్యలను దూరం చేసుకోవాలంటే చిట్కాలు పాటించాలి.
దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్నా ఆకలి మందగిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, సైనస్, నాసికా రద్దీ, వాసన రుచికి ఆటంకం కలిగిస్తాయి. ఆర్థరైటిస్ లేదా ఫైబ్రోమైయాల్టియా కారణంగా శారీరక ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆకలి తగ్గిస్తుంది. దీర్ఘ కాలిక వ్యాధులు కూడా ఆకలిని దూరం చేస్తాయనడంలో సందేహం లేదు. ప్రక్టోప పేగు, సిండ్రోమ్, హైపో థైరాయిడిజం, హెపటైటిస్, హెచ్ ఐవీ, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు కూడా ఆకలి లేకుండా చేస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లు కూడా మనకు ఆకలికి అంతరాయం కలిగిస్తాయి.

పలు రకాల వ్యాధుల కోసం వేసుకునే మందులు కూడా మనకు ఆకలిని అంతమొందిస్తాయి. యాంటీ బాటిక్ వంటి మాత్రలతో మనకు నష్టాలు కూడా ఉంటాయి. ఫలితంగా ఆకలి మందగిస్తుంది. వయసు ప్రభావం కూడా ఆకలి తగ్గిస్తుంది. వయసు పైబడిన కొద్ది జీవక్రియ తగ్గుతుంది. అందువల్ల ఆకలి వేయకుండా పోతుంది. వృద్ధులు ఆహారాన్ని నమిలే సామర్థ్యం కూడా తక్కువ కలిగి ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వాంతులు, విరేచనాలతో ఆకలి తగ్గుతుంది. గర్భధారణ సమయంలో వాంతులు, గుండెల్లో మంట మొదలైన సమస్యలు వేధిస్తాయి.