Health Benefits Of Tomatoes: టమాటాలతో ఎన్నో లాభాలున్నాయి. ఇందులో ఉండే కాల్షియం పాస్పరస్ విటమిన్ ఎ, సిలతో పాటు మెగ్నీషియం, కాపర్ పుష్కలంగా ఉండటంతో టమాటాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ సమస్య, గుండె సంబంధిత రోగాలు, మధుమేహం రోగాలకు మంచి మందులా పనిచేస్తుంది. కంటి సమస్యలు ఉన్న వారికి కూడా ఉపకరిస్తుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి దూరం చేస్తాయి. దీంతో మనకు అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఆరోగ్యం మన సొంతం అవుతుందనడంలో సందేహం లేదు.

టమాటాలను తరచుగా తింటే శరీరానికి కావాల్సిన ఐరన్ ఏడు శాతం లభిస్తుంది. టమాటాలు ఎముకలను బలంగా ఉంచుతాయి. రోజు టమాటాలు తింటే కాల్షియం, విటమిన్ కె, ఎముకలు బలంగా ఉండేందుకు దోహదపడుతుంది. అధిక బరువును నియంత్రించుకోవాలనుకుంటే టమాటాలు రోజు తీసుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుందనడంలో సందేహం లేదు. ఇందులో పొటాషియం, మాంగనీసు హృదయానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర నిల్వలను కూడా తగ్గిస్తాయి. అందుకే టమాటాలను రోజు వారి ఆహారంతో పాటు జ్యూస్ చేసుకుని తాగితే కూడా లాభమే.
రోజువారీ ఆహారంలో తీసుకుంటే నోటి, లివర్, క్యాన్సర్ సమస్యలు రాకుండా కాపాడతాయి. ఇంకా వీటితో అనేక లాభాలున్నాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి. మొటిమలు తగ్గించేందుకు సహకరిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ కొవ్వును తగ్గిస్తుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. ఇన్ని రకాలుగా లాభాలున్న టమాటలను ప్రతి రోజు మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. టమాటాలను జ్యూస్ గా చేసుకుని తాగితే కూడా ఉపశమనమే.

టమాటాలు లేని కూర ఉండదంటే అతిశయోక్తి కాదు. టమాటాల్లో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందుకే టమాటాలను ఒక కిడ్నీల్లో రాళ్లు వచ్చిన వారు తప్పిస్తే అందరు తీసుకోవచ్చు. రోజువారీ ఆహారంలో టమాటాను భాగం చేసుకుని మన రోగాలను దూరం చేసుకోవచ్చు. అందుకే టమాటాలతో మన శరీరంలోని వ్యర్థాలను దూరం చేసుకుని మంచి ఆరోగ్యకరమైన జీవనం గడిపేందుకు టమాటాలను నిత్యం వాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.