
Husband And Wife Relationship: ఆచార్యచాణక్యుడు జీవితాలకు సంబంధించిన ఎన్నో సత్యాలు చెప్పాడు. ఆనాడు ఆయన సూచించిన మార్గాలు ఇప్పటికి అనుసరణీయంగానే ఉండటం గమనార్హం. అతడి దూరదృష్టికి అందరు అవాక్కవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక భర్త తన భార్య దగ్గర చెప్పకూడని నాలుగు అంశాలు సూచించాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాలు చెబితే భార్య మన మాట వినదు. ఖర్చు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యను ఎప్పుడు మన మాట వినేలా చేసుకోవాలి తప్ప ఆమె మాట మనం వినేలా ఉండే సమస్యలే. చాణక్య నీతి ప్రకారం భార్యలకు చెప్పకూడని విషయాలు తెలుసుకుంటే మనకు జీవితంలో సమస్యలే రావని చాణక్య అభిప్రాయం.
మన ఆదాయం గురించి..
భార్యకు ఎప్పుడు కూడా మనం సంపాదించే ఆదాయం గురించి చెప్పకూడదు. చెబితే ఖర్చులు పెడుతుంది. మనం ఎక్కువగా సంపాదిస్తున్నామని తెలిస్తే ఇంకా ఎక్కువ ఖర్చులు చేస్తుంది. దీంతో తన ఆదాయం గురించి తెలిసిన భార్య ఎక్కువ ఖర్చు పెట్టడం చేస్తే కుటుంబ నిర్వహణ కష్టంగా మారుతుంది. ఆడాళ్లకు షాపింగ్ మీద మహా సరదా ఉంటుంది. భర్త సంపాదన ఎంత అనేది తెలిస్తే అంతే సంగతి. అందుకే మగాడి సంపాదన భార్యలకు తెలియడం సమంజసం కాదు. రహస్యంగానే ఉంచుకోవడం మంచిది.
బలహీనత బహిర్గతమైతే..
ప్రతి మనిషికి బలహీనత ఉంటుంది. అదేంటనేది కూడా భార్యలకు తెలియనివ్వకూడదు. ఒకవేళ తెలిస్తే మన బలహీనతను పదేపదే ప్రస్తావిస్తూ మనల్ని నిర్జీవంగా చేస్తుంది. బలహీనతను అధిగమించాలని అనుకున్నా సాధ్యం కాకుండా చేస్తుంది. సూటిపోటి మాటలతో మనలో శ్రద్ధ లేకుండా చేస్తుంది. అదే పనిగా మనల్ని దెప్పి పొడుస్తుంది. దీంతో మనలో ఏ మాత్రం ఇంట్రస్ట్ ఉండదు. పదే పదే అంటుంటే ఆత్మన్యూనతా భావానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్ని సమయాల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా రావడం సహజం.
అవమానం
మనం జీవితంలో ఎక్కడైనా అవమానం పొందితే ఆ విషయాన్ని కూడా భార్యకు తెలియనివ్వకూడదు. మనం చెప్పినట్లయితే సమయం వచ్చినప్పుడల్లా పుండు మీద కారం చల్లినట్లు అదే ప్రస్తావన తెస్తూ మనల్ని బలహీనుల్ని చేస్తుంది. ఇది మన సంసారంలో కలతలకు ఆస్కారం కల్పిస్తుంది. అందుకే ఇలాంటి విషయాల గురించి భార్యల దగ్గర చర్చించకపోవడమే మంచిది. దీనిపై భార్య ఆటపట్టించే సూచనలు కూడా ఉంటాయి. మనం ఎక్కడైనా అవమానానికి గురైతే ఆ విషయం ఎవరికి తెలియకుండా ఉంచుకోవడమే శ్రేయస్కరం.

చేసే సహాయం
ఎవరికైనా సహాయం చేద్దామనుకున్నా గోప్యంగా ఉంచుకోవాలి. భార్యకు చెబితే అది చేయకుండా చేస్తుంది. లేదంటే ఇంకా ఇతరులకు చేయమని కూడా చెబుతుంది. దీంతో రెండు చిక్కులే. అందుకే మనం చేసే సాయం భార్యకు చెప్పకుండా చేయడమే బెటర్. కుడి చేయితో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియవద్దంటారు. ఎట్టి పరిస్థితుల్లో మనం చేసే అన్ని పనులు భార్యతో షేర్ చేసుకోకూడదు. అలా చేయడం వల్ల సమస్యలే వస్తాయి. ఆచార్య చాణక్యుడు సూచించిన ఈ మార్గాలు ఇప్పటికి కూడా ఆచరణీయమే. భార్యల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా చాణక్యుడు తనదైన శైలిలో వివరించాడు.
