Sitting Long Hours: ఇటీవల జీవన శైలి మారుతోంది. అందరు కూర్చుండి చేసే ఉద్యోగాలే చేస్తున్నారు. దీంతో గంటల తరబడి కదలకుండా కూర్చుని వేళ్లాడిస్తూ చేసే పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజు గంటల తరబడి కూర్చుని చేసే పనులతో ఇబ్బందులే వస్తాయి. ఒకే దగ్గర గంటలకు గంటలు కూర్చుంటే ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఫోన్ చూసినా కంప్యూటర్ వర్క్ చేస్తూ టీవీ చూసి కూర్చుని పనులు చేసుకుంటారు. కూర్చుని చేసే పనులతో శరీరానికి శ్రమ ఉండదు. గంటల పాటు కూర్చుని చేసే పనులతో మనకు ముప్పు ఏర్పడుతుంది.

కొందరు పనిలో పడి అలాగే కూర్చుండి పోతారు. అందులోనూ అటు ఇటు తిరుగుతూ కూర్చోవడం వల్ల ఫలితం ఉంటుంది. కూర్చునే ఉండేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. కూర్చుని ఉంటే మనకు అనర్థాలే వస్తాయి. గంటల పాటు కూర్చుని ఉండటం వల్ల ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, నడుము చుట్టు కొవ్వు పేరుకుపోవడం, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వంటి సమస్యలు దరిచేరతాయి. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి.
రోజు ఎనిమిది గంటలు కూర్చుని పని చేయడం వల్ల అధిక బరువు, ధూమపానం వల్ల కలిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మిలియన్ కంటే ఎక్కువ మందిపై అధ్యయనం నిర్వహించారు. ప్రతి రోజు 60 నుంచి 75 నిమిషాల పాటు మితమైన ఇంటెన్సివ్ శారీరక వ్యాయామంలో పాల్గొన్న వారిపై, పని మధ్యలో లేచిన వారిపై పరిశోధనలు నిర్వహించారు. నిరంతరంగా కూర్చుని ఉండే వారికి అనారోగ్య లక్షణాలు పెరుగుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి వారు ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తే కాస్త ఫలితం ఉంటుందని తెలిపారు.

ఎక్కువ సమయం కూర్చుని ఉండటంతో హృదయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ తో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో సమస్యలు పెరుగుతాయి. అలాగే కూర్చుని ఉండకుండా అప్పుడప్పుడు లేచి అటు ఇటు తిరగాలి. కదలకుండా కూర్చుని ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు. పనిమధ్యలో 30 నిమిషాలకు ఒకసారి లేని నిలబడండి. ఫోన్ లేదా టీవీ చూస్తున్నప్పుడు పాదాలను పైకి ఉంచండి. డెస్క్ వద్ద పని చేసే వారు నిలబడి ఉండేందుకు ప్రయత్నించండి. కార్యాలయాల్లో లిఫ్ట్ లను ఉపయోగించకండి. నడిచి వెళ్లేందుకు ప్రయత్నించండి.
నెమ్మదిగా వ్యాయామం చేయాలి. దీనివల్ల ఎక్కువ కేలరీలు ఖర్చు చేయొచ్చు. వ్యాయామం వల్ల బరువు తగ్గుతుంది. శక్తి పెరుగుతుంది. ఉదయం, సాయంత్రం రెండు సమయాల్లో వాకింగ్ చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. కూర్చుని ఉండే వారు ఇలాంటి చిట్కాలు పాటిస్తే అనారోగ్యాలను దూరం చేసుకునే వెసులుబాటు కనిపిస్తుంది.