Avasarala Srinivas- Avatar 2: పదేళ్ల క్రితం ప్రపంచ సినీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన అవతార్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన ‘అవతార్ 2’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో కనీవినీ ఎరుగని రేంజ్ లో విడుదల అవ్వబోతుంది..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేక ప్రీమియర్ షోస్ ని పలు ప్రాంతాలలో ప్రదర్శించారు..టాక్ ఊహించిన దానికంటే గొప్పగా వచ్చింది..సినిమా మూడు గంటల నిడివి ఉండడం తో కాస్త సాగదీసినట్టుగా అనిపించినా థియేట్రికల్ అనుభూతి మాత్రం చిరకాలం గుర్తుండిపోయ్యే విధంగా ఉంటుందని ఈ ప్రీమియర్ షోస్ చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు.

ముఖ్యంగా ఐమాక్స్ 3D ఫార్మాట్ లో మాత్రం ఈ సినిమాని తప్పక చూడాల్సిందే అంటున్నారు వీక్షికులు..అబ్బురపరిచే గ్రాండియర్ విజువల్స్ తో పాటుగా ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో బాగా పండాయట..ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఉన్న సినిమాలు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయి అందరికీ తెలిసిందే.
అందుకే ఇక్కడ కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు..ఇక తెలుగు వెర్షన్ కి కూడా మన రెండు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది..ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం తెలుగు వెర్షన్ కి కలిపి వంద కోట్ల రూపాయలకు జరిగిందట..అంటే మన స్టార్ హీరో రేంజ్ బిజినెస్ అన్నమాట..అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోయాయి..కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమాకి మొదటి రోజు 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

ఇక తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా మరింత చేరువ అయ్యేందుకు డైలాగ్స్ మొత్తం ప్రముఖ నటుడు , రచయిత అయినా అవసరాల శ్రీనివాస్ తో రాయించారు..అందుకోసం ఆయనకీ కోటి రూపాయిల పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తుంది..డబ్బింగ్ కోసం కూడా ప్రొడక్షన్ టీం ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేశారట..రేపు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో 90 శాతం థియేటర్స్ లో ఈ చిత్రం విడుదల కాబోతుంది..భారీ అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రం ఆ అంచనాలను ఎంత వరుకు అందుకుంటుందో చూడాలి.