Best Investment Schemes: నేటి కాలంలో డబ్బు సంపాదించడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. ఖర్చులు, అవసరాలు పెరిగిపోవడంతో వాటి కోసం ఆదాయాన్ని ఆర్జించడమే కాకుండా సేవింగ్స్ కోసం ప్రణాళికలు వేస్తున్నారు. చాలా మంది డబ్బు సంపాదించడంలో చూపిన ఇంట్రెస్ట్ వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అధిక ప్రయోజనమే ఆలోచించడం లేదు. పైగా తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ రావాలని చూస్తున్నారు. కానీ దిన ఖర్చులపై భారం పడకుండా తక్కువ పొదుపు చేసుకుంటూ పోవడం వల్ల అధిక వడ్డీ వస్తుంది. ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి. కానీ చాలా మందికి ఈ విషయాల తెలియడం లేదు. తాజాగా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.9 వేల వడ్డీని నెలనెలా జీతంలా పొందుతారు. మరి ఆ స్కీం గురించి తెలుసుకోవాలని ఉందా..
ఆదాయం వచ్చిన వారు చాలా మంది బ్యాంకుల్లో దాచుకుంటారు. కొందరు వడ్డీలకు ఇస్తారు. అయితే ప్రైవేట్ వ్యక్తులకు వడ్డీకి ఇవ్వడం ద్వారా అనేక ఇబ్బందులు ఎదరవుతున్నాయి. బ్యాంకుల్లో దాచుకుంటే తక్కువ వడ్డీని మాత్రమే ఇస్తారు. కానీ పోస్టాపీసుల్లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తే ఊహించని వడ్డీ అందుతుంది. ఇలా అధిక ఆదాయం ఆర్జించడానికి ఎవరైనా అర్హులే అయితే కాస్త ఓపిక పట్టాలి. షార్ట్ టర్మ్ లో లాభాలు రావాలంటే మాత్రం అస్సలు కుదరదు. అదెలాగంటే
బ్యాంకులు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఫోస్టాపీసుల్లో కూడా రకరకాల పథకాలు ప్రవేశపెడుటున్నారు. ఇందులో మంత్లీ ఇన్వెస్ట్ మెంట్ స్కీం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. కానీ ఇప్పటికి అనుగుణంగా దీనిని మార్చారు. ఈ స్కీం ప్రకారం నెలా కొంత డబ్బును సేవింగ్ చేసుకుంటూ పోవాలి. అవసరాలు తీరాక మిగిలిన డబ్బును మాత్రమే వేసుకోవడానికి ప్లాన్ వేయాలి. ఇలా 5 సంవత్సరాల పాటు 9 లక్షల వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దీనికి 7.5 వడ్డీని ఇస్తున్నారు. ఇది ఫ్యూచర్లో పెరిగితే వడ్డీ కూడా ఎక్కువే వస్తుంది.
అయితే ఈ స్కీంలో భార్యభర్తలు చేరి రూ.15 లక్షల వరకు పొదుపు చేసుకుంటూ పోవచ్చు. రూ.15 లక్షల పొదుపు చేస్తే సంవత్సరానికి రూ.1,11,00 వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.9 వేల వడ్డీ అన్నమాట. అయితే ఈ స్కీంలో చేరిన వారు డబ్బును ఏడాది పాటు తీసుకోరాదు. ఆ తరువాత తీసుకోవాలనుకున్నా 2 శాతం పెనాల్టీ వేస్తారు. 5 సంవత్సరాల వరకు ఎటువంటి అవసరం లేని వారికి ఇది చాలా ఉపయోగం.