Watermelon Seeds Benefits: వేసవిలో విరివిగా దొరికేది పుచ్చకాయ. అందుకే దీన్ని ఎక్కువగా తింటారు. ఇందులో తొంభై శాతం నీరే ఉంటుంది. దీంతో మనం పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం డీ హైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. గుజ్జుతో పాటు గింజల్లో కూడా ఎన్నో ప్రొటీన్లు దాగి ఉన్నాయి. దాని గింజలను కూడా భద్రపరుచుకుని పలు ఔషధాల్లో వాడుకోవచ్చు. దీనికి గాను మనం వాటితో తయారు చేసుకునే ఔషధాల్లో ఫేస్ మాస్క్ ఒకటి.
ఎలా తయారు చేసుకోవాలి
ఫేస్ మాస్క్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ గింజలు, ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్, ఒక టీ స్పూన్ తేనె తీసుకోవాలి. వీటితో అద్భుతమైన ఫేస్ మాస్క్ తయారు చేసకోవచ్చు. దీని వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఫేస్ మాస్క్ తయారు చేసుకునే..
ముందుగా పుచ్చకాయ గింజలను పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పులో ఈ పొడి, ముల్తానీ మట్టిని తీసుకుని కలుపుకోవాలి. తరువాత అందులో ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కలుపుకుని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుని అందులో తేనె కలుపుకుని మళ్లీ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు గ్లాసులోకి తీసుకుని భద్రపరచుకోవాలి.
ఎలా వాడాలి
ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఓ 15 నిమిషాలు ఆగి చేతులతో నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత కడుక్కుంటే మంచి ఫలితాలు వస్తాయి. ముఖంపై మచ్చలు, మొటమలు రాకుండా ఉండేందుకు సాయడుతుంది. ఈఫేస్ మాస్క్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. సహజసిద్ధంగా తయారైంది కాబట్టి దీని వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.