Cardamom: యాలకులు ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి రుచికి చేదుగా ఉంటాయి. కానీ ఇవి ఇచ్చే ఆరోగ్యం గురించి తెలిస్తే షాక్ అవుతారు. సాధారణంగా యాలకులు పాయసం, స్వీట్స్, పులావ్, బిర్యానీ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Written By: Chai Muchhata, Updated On : October 10, 2023 5:27 pm

Cardamom

Follow us on

Cardamom: నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. వాతావరణ కాలుష్యంతో పాటు కల్తీ ఆహారంతో అనేక అనారోగ్యం సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే టేస్టీ ఫుడ్, ఇతర కారణాల వల్ల కొన్ని రోగనిరోధక శక్తి ఇచ్చే ఆహార పదార్థాలను వాడడం లేదు. దీంతో శరీరం అలసటకు గురవుతుంది. ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలు రెగ్యులర్ గా వంట ల్లో వాడడం వల్ల శరీరానికి ఆరోగ్యం ఇవ్వడంతో పాటు అనారోగ్యాలు రాకుండా కాపాడుతాయి. వీటిలో యాలకులు ఒకటి. యాలకులు కొన్ని ప్రత్యేకమైన వంటకాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. కానీ రెగ్యులర్ గా వీటిని వివిధ పద్ధతుల్లో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. అదెలాగంటే?

యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి రుచికి చేదుగా ఉంటాయి. కానీ ఇవి ఇచ్చే ఆరోగ్యం గురించి తెలిస్తే షాక్ అవుతారు. సాధారణంగా యాలకులు పాయసం, స్వీట్స్, పులావ్, బిర్యానీ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో మెగ్నీషియం, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో జీర్ణక్రియతో పాటు గుండె సమస్యలను దూరం చేస్తుందని అంటున్నారు. యాలకులను కేవలం వంటకాల్లో మాత్రమే కాకుండా ఇలా తీసుకోవచ్చు.

యాలకులు మౌత్ ప్రెషర్ గా పనిచేస్తుంది. దీంతో ఒకటి లేదా రెండు యాలకులు నోట్లో వేసుకోవడం ద్వారా నోరు శుభ్రం అవుతుంది. అంతేకాకుండా తాజా శ్వాస లోపలికి వెళ్లేలా చేస్తుంది. నిత్యం యాలకులు నమలడం వల్ల నోట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా మాయమవుతాయి. యాలకులు జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి పనిచేస్తాయి. యాలకుల టీ తాగడం వల్ల మైండ్ ఫ్రెష్ గా మారుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలను దూరం చేస్తుంది.

రక్త ప్రసరణను ఉంచడంలో ఇది ఎంతో ఉపయోగం. అందుకే దీనిని అప్పుడప్పుడు మాత్రమే కాకుండా రెగ్యులర్ గా తీసుకునే ప్రయత్నం చేయాలి. శరీరం డిటాక్సిపై కావడంతో పాటు విషపూరిత పదార్థాలను పాలద్రోలుతుంది. మూత్ర విసర్జన సక్రమంగా ఉండడానికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. లైంగిక సమస్యలను దూరం చేయడానికీ యాలకులు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని పాలలో తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు దరిచేరవు.