Jaggery Tea Benefits: చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వేధిస్తాయి. చలి నుంచి మనకు ఈ సమస్యలు వస్తుంటాయి. గొంతునొప్పి ఇన్ఫెక్షన్ కూడా బాధిస్తుంది. చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు రకరకాల మార్గాలు అన్వేషించాల్సి వస్తుంది. సహజ సిద్ధమైన స్వీటుగా బెల్లం మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలతో ఎన్నో లాభాలుంటాయి. బెల్లంలో విటమిన్లు, కాల్షియం, రాగి, పొటాషియం ఉండటంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. చల్లని వాతావరణంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ప్రాసెస్ చేసిన ఆహారాల వల్ల మనకు ఎంతో నష్టం కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే వీటికి బదులుగా బెల్లం తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. ఇతర టీలకు బదులు బెల్లంతో చేసిన టీ తయారు చేసుకుని తాగితే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చక్కెరతో పోలిస్తే బెల్లం మంచిదని చెబుతుంటారు. మన శరీరంలో టాక్సిన్స్ ఉండటం వల్ల మనకు ఎంతో హాని కలిగిస్తాయి. వీటిని బయటకు పంపేందుకు పరగడుపున ఒక కప్పు బెల్లం టీ తాగడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయి.
ఇతర వ్యాధులను రాకుండా బెల్లం నిరోధిస్తుంది. బెల్లం టీ క్రమం తప్పకుండా తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. జీర్ణక్రియ దెబ్బతినకుండా ఉంటుంది. మలబద్ధకం సమస్య రాదు. షుగర్ టీకి బదులు బెల్లం టీ తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయనడంలో సందేహం లేదు. అధిక బరువును తగ్గించడానికి దోహదపడుతుంది. బెల్లం టీని డైట్ లో భాగంగా చేసుకుంటే ఎంతో ఉత్తమం. పరగడుపున ఇది తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కేలరీలు కరుగుతాయి. విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి6, జింక్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ పెంచడానికి కారణమవుతుంది. కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఉదయం పూట బెల్లం టీ తాగి వ్యాయామం చేస్తే బాగుంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాల వల్ల శరీరం ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా చూస్తుంది. శరీరాన్ని బలంగా తయారు చేస్తుంది. ఇలా బెల్లంతో మనకు అనేక ఉపయోగాలు ఉన్నందున మన ఆహారంలో దీన్ని చేర్చుకుని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దేహాన్ని అనారోగ్యాల నుంచి దూరం చేస్తుంది.