Photo Story: : ఈ చిన్నారి ఇప్పుడో స్టార్ హీరోయిన్. స్టార్ కిడ్ కూడా. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్న ఈ స్ట్రాంగ్ లేడీ మల్టీ టాలెంటెడ్. ప్రొఫెషనల్ సింగర్, కంపోజర్ అండ్ రైటర్ కూడాను. వెస్ట్రన్ మ్యూజిక్ పై ఆమెకు గట్టి పట్టుంది. లండన్ తో పాటు పలు దేశాల్లో లైవ్ మ్యూజిక్ షోలు ఇచ్చారు. ఈమెది బోల్డ్ యాటిట్యూడ్. సమాజం, పద్ధతులు, పట్టింపులు అసలు ఉండవు. నచ్చిన పని చేసేయడమే అంటుంది. కెరీర్ బిగినింగ్లోనే సంచలన పాత్రలు చేశారు. మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించారు. గట్స్ ఉన్న హీరోయిన్ అని చెప్పొచ్చు.

ఇప్పటికే మీకు ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఈ చిన్నారి ఎవరో కాదు కమల్ హాసన్ పెద్దమ్మాయి శృతి హాసన్. తాజాగా శృతి హాసన్ తన చైల్డ్ హుడ్, టీనేజ్ ఫోటోలు షేర్ చేశారు. అలాగే అప్పటికీ ఇప్పటికీ తనలో చాలా మార్పు వచ్చిందని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు. చిన్నప్పటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయట. శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక సంక్రాంతి హీరోయిన్ గా అవతరించిన శృతి హాసన్ రెండు సూపర్ హిట్ చిత్రాలు ఖాతాలో వేసుకున్నారు. వాల్తేరు వీరయ్య అయితే ఇండస్ట్రీ హిట్ వైపుగా అడుగులు వేస్తుంది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా వసూళ్ల జోరు తగ్గలేదు. అలాగే వీరసింహారెడ్డి మిక్స్డ్ టాక్ తో కూడా మంచి వసూళ్లు సాధించింది. వీరసింహారెడ్డి బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. వాల్తేరు వీరయ్య సినిమాకు కే ఎస్ రవీంద్ర దర్శకుడు కాగా… వీరసింహారెడ్డి చిత్రాన్ని గోపీచంద్ మలినేని తెరకెక్కించారు.

శ్రుతి హాసన్ కెరీర్ మరలా ఊపందుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె చేతిలో సలార్ రూపంలో భారీ ప్రాజెక్ట్ ఉంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. కెజిఎఫ్ టీం నుండి వస్తున్న సలార్ ప్రభాస్ కమ్ బ్యాక్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పెద్ద ప్రాజెక్ట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. సలార్ విజయం సాధిస్తే… శృతి కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది.