Cumin Water: మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో జీలకర్ర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జీలకర్ర కూరలకు రుచి ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా బాగా పనిచేస్తుంది. ప్రతి రోజు జీలకర్ర తీసుకుంటే మన శరీరానికి మేలు జరుగుతుంది. జీలకర్ర మలబద్దకాన్ని నిరోధిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజు జీలకర్ర నీళ్లు తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకే జీలకర్ర మన ఆహారంలో ఒక భాగంగా ఉంటోంది.

జీలకర్రతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక గ్లాస్ నీటిని మరిగించి చల్లార్చి అందులో జీలకర్ర వేసుకుని తాగితే మంచి పోషకాలు అందుతాయని తెలిసిందే. జీలకర్రతో అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు పోతాయి. జీర్ణక్రియ వేగంగా పనిచేయడానికి ఇది దోహదపడుతుంది. జీలకర్ర నీళ్లు తాగితే గర్భధారణ సమయంలో ఆకలి పెంచడానికి సాయపడుతుంది. గర్భధారణ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను కూడా తొలగిస్తుంది. అందుకే జీలకర్రను మనం రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటున్నాం.
Also Read: Janasena Chief Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంతలా భయపడడానికి కారణం ఏమిటి?
మధుమేహులకు కూడా జీలకర్ర ఔషధంగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ను కంట్రోల్ చేసే దివ్యౌషధంగా జీలకర్ర పనిచేస్తుంది. ఉన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. జీలకర్ర రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. బీపీని కంట్రోల్ చేసే శక్తి జీలకర్రకు ఉంది. దీంతో జీలకర్ర నీటిని తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని తెలుస్తోంది.

శ్వాసకోశ సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఉదయం జీలకర్ర నీరు తాగితే ఎన్నో రకాల మేలు జరుగుతుందని తెలిసిందే. మన వంటింట్లో ఉండే జీలకర్రతో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలో జీలకర్ర నీరు తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీటిలో ఇన్ని రకాల లాభాలుండటం వల్ల దీంతో ఎంతో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. అందుకే జీలకర్ర నీటిని రోజు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
Also Read:Telangana Ministers Controversies: మేము మంత్రులం.. మా నియోజకవర్గాలకు సామంత రాజులం