
Finger Millet : మనకు ధాన్యాల విలువ తెలిసిపోవడంతో వాటిని ఎక్కువగా వాడటానికి ఇష్టపడుతున్నాం. ఇటీవల కాలంలో రాగుల్లో ఉండే పోషకాల గురించి తెలియడంతో వాటిని ఎక్కువగా వాడుతున్నారు. రాగుల పిండితో రొట్టెలు, రాగి జావ, రాగులతో పలు రకాల వంటలు చేసుకుని ఏదో ఒక రూపంగా వాటిని తినేందుకు ముందుకు వస్తున్నారు. పూర్వం రోజుల్లో కూడా రాగుల ప్రాధాన్యం తెలుసుకుని వారు జావగా తయారు చేసుకుని తాగే వారు. దీంతో వారికి ఎలాంటి రోగాలు వచ్చేవి కావు. రాగుల్లో అంతడి పోషకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూడా రాగుల వినియోగం పెరిగింది.
పోషకాలు మెండు
రాగుల్లో పోషకాలు బాగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ,బి,సిలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పొటాషియం, కాల్షియం లు మన దేహానికి రోగాలు రాకుండా చేస్తాయి. రాగుల్లో ఉండే పాలిపినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. రాగుల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో చక్కెర వ్యాధి ఉన్న వారికి మంచి ఆహారం. అందుకే ఉదయం అల్పాహారంలో వీటిని తీసుకుంటే మంచిది.

కొవ్వు నియంత్రణలో..
కొవ్వును నియంత్రిస్తాయి. గుండెకు మేలు చేస్తాయి. రక్తసరఫరా బాగా జరిగేందుకు దోహదం చేస్తాయి. రాగుల్లో పీచు అధికంగా ఉండటంతో జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు పాటుపడతాయి. పెద్దపేగు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. శరీరంలో అధికంగా ఉన్న వేడిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇలా రాగులు తీసుకోవడం వల్ల మనకు ఎంతో ఉపశమనం లభిస్తుంది.
డీహైడ్రేషన్ కాకుండా..
ఎండాకాలంలో శరీరం తగినంత నీరు లేకపోతే డీ హైడ్రేడ్ అవుతుంది. ఈ ప్రమాదం నుంచి రాగులు రక్షిస్తాయి. రాగుల జావ తీసుకుంటే మనకు ఆ సమస్య ఉండదు. ముసలితనం రాకుండా చేస్తాయి. శరీరం కాంతివంతంగా మారడంలో సహకరిస్తాయి. నిత్య యవ్వనంగా కనిపించేందుకు రాగుల ఆహారం బాగా పనిచేస్తుంది. రక్తహీనతకు చెక్ పెడతాయి. కాలేయంలో ఏర్పడే అదనపు కొవ్వును కరిగించడంలో కూడా ఉకరిస్తుంది. ఇలా రాగులతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉండటంతో నిత్యం వాటిని తీసుకోవడం ఎంతో ఉత్తమమని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు.