
Empty Stomach: ఇటీవల కాలంలో ఆధునిక విధానంలో జీవనశైలి మారుతోంది. ఆహార అలవాట్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫలితంగా వ్యాధులు కూడా అదే రీతిలో వ్యాపిస్తున్నాయి. ఇరవైలోనే అరవైలా రోగాలు చుట్టుముడుతున్నాయి. అయినా మన అలవాట్లలో మార్పులు రావడం లేదు. ఫలితంగా బాధలతోనే సహవాసం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమయంలో మనం ఉదయం పూట పరగడుపున తీసుకోవాల్సిన ఆహారాలపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం వస్తోంది. అందరు ఉదయాన్నే వేడివేడిగా దోశలు, పరోటా, పూరీ, బజ్జీ వంటి ఆయిల్ తో కూడిన వాటిని ఎక్కువగా తింటున్నారు. దీంతో కాలేయానికి కష్టాలు తెస్తున్నారు. ఉదయం పూట ఖాళీ కడుపుతో నూనె పదార్థాలు తింటే లివర్ కు ఎంతో ఇబ్బందిగా మారుతుందనే విషయం ఎంత మందికి తెలుసు.
పెరుగు
మన జీవక్రియను సరైన దారిలో పెట్టే పదార్థం పెరుగు. పెరుగులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఒకరోజు పులియబెట్టిన పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పెరుగును ఖాళీ కడుపుతో మన ఆహారంగా చేసుకుంటే ఎంతో మంచి ఫలితాలు వస్తాయి. పెరుగులో ప్రొ బయోటిక్స్ ఉండటం వల్ల జీవక్రియ సాఫీగా సాగేందుకు దోహదపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు పెరుగును ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
అరటి
అరటి పండు కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇది మనకు ఆరోగ్య ప్రదాయినిగా పనిచేస్తుంది. అరటి పండు తినడం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది. ఉదయం పరగడుపున అరటి పండు తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఉదయం సమయంలో అరటి పండు తినేందుకు ఆసక్తి చూపాలి. మధుమేహంతో బాధపడేవారు మాత్రం అరటి పండు తినడం వల్ల ఎక్కువ షుగర్ పెరుగుతుంది.

ఓట్స్
మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాల్లో ఓట్స్ కూడా ప్రధానమైనవి. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఉదయం పరగడుపున వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్య పరిరక్షణ కలిగిస్తాయి. ఇందులో ఉండే పోషకాలతో మనజీర్ణవ్యవస్థ మెరుగు పడేలా చేస్తాయి. వీటిని తినడం వల్ల శక్తి తక్షణమే కాకుండా మెల్లగా వస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా స్థిరంగా ఉంటాయి. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచే ఆహారాల్లో ఓట్స్ కూడా ఉండటం గమనార్హం. మధుమేహులు వీటని ఆహారంగా తీసుకోవడం ఎంతో మంచిది.
గుడ్లు
వైద్యులు కూడా చెబుతున్నారు. రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారని. అందుకే గుడ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల మంచి లాభాలే ఉంటాయి. గుడ్డులో విటమిన్ డి, ఐరన్, పొటాషియం, జింక్ ఉండటంతో అధిక బరువు రాకుండా చేస్తుంది. మన ఆరోగ్యానికి గుడ్డు ఎంతో దోహదపడుతుంది. రోజువారీ ఆహారంలో గుడ్డును చేర్చుకోవడం వల్ల మనకు పోషకాలు అంది ఆరోగ్యం మెరుగుపడేందుకు దోహదపడుతుంది. గుడ్డును ఆహారంగా తీసుకోవడంతో మనకు శ్రేయస్కరమని గుర్తుంచుకోవాలి.
బాదంపప్పు
మన ఆరోగ్యాన్ని పెంచే ఆహారాల్లో బాదం పప్పులు కూడా ఒకటి. వీటిని రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే తింటే ఎంతో లాభం. బాదంలోని ఫ్యాట్స్ శక్తి స్థాయిలను పెరిగేలా చేస్తుంది. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా నిరోధిస్తాయి. రోజు ఖాళీకడుపుతో బాదం పప్పులు తీసుకుంటే మంచి ప్రయోజనమే. కాకపోతే వాటిని తొక్క తీసి తినాలి. దాంతో ఇంకా బెనిఫిట్స్ వస్తాయి. బాదం పప్పు ఖరీదైనవి అయినా మంచి పోషకాలు నిండిన ఆహారంగా ఉండటంతో వాటిని తినేందుకు మొగ్గు చూపడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి.