
Snoring Problem: మనలో చాలా మంది గురక పెడుతుంటారు. దీంతో ఎదుటి వారికి కూడా నిద్ర పట్టదు. గురక శబ్ధం భయంకరంగా ఉంటుంది. పక్కన ఉన్న వారికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ వారు మాత్రం హాయిగా నిద్రపోతూ పెద్ద శబ్ధం చేస్తుంటారు. గురక ఎందుకు వస్తుంది? దాని వల్ల నష్టాలేంటి? అనే విషయాలపై వైద్యులు కూడా చెబుతున్నారు. గురక వల్ల అనేక అనర్థాలు వచ్చే అవకాశాలున్నాయి. గుండె జబ్బులకు మూలం గురకే అని సూచిస్తున్నారు. గురకే కదాని తేలిగ్గా తీసుకోకూడదు. దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.
Also Read: Hero Dhanush: తెలుగు బాష రానందుకు సిగ్గు పడుతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో ధనుష్
అధిక బరువు ఉన్న వారు..
అధిక బరువు ఉన్న వారికి గురక వచ్చే ప్రమాదం ఉంటుంది. బరువు అదుపులో ఉంచుకుంటే గురక వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. జంక్ ఫుడ్స్ కాకుండా పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది. గురక వల్ల వచ్చే ఇబ్బందుల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటే ఫలితాలు రావడం ఖాయమే. దీనికి గాను కొన్ని చర్యలు తీసుకోవాల్సిందే. గురక వల్ల కలిగే నష్టాలను గుర్తించి వాటిని దూరం చేసుకునేందుకు చొరవ తీసుకోవాలి.
పొగతాగకూడదు
పొగ తాగే అలవాటు ఉన్న వారికి కూడా గురక వస్తుంది. స్మోకింగ్ ను దూరం చేసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. అల్కహాల్ ను తీసుకోకపోవడమే ఉత్తమం. మద్యపానం వల్ల కూడా గురక ముప్పు పొంచి ఉంటుంది. ప్రతి రోజు వాకింగ్ చేస్తే కూడా గురక సమస్య లేకుండా పోతుంది. దీని కోసం మనం మందుకు తలొగ్గకూడదు. చాలా మంది ఎక్కువగా మద్యం తాగడం వల్ల గురక ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల గురక ముప్పు తప్పించుకునేందుకు చొరవ తీసుకుంటే సరి.

వైద్యుల సలహా..
వైద్యుల సలహా మేరకు మన అలవాట్లు మార్చుకోవాలి. ప్రతి రోజు యోగా వంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మౌత్ ఎక్సర్ సైజులు చేయడం కూడా మంచిదే. మనం పడుకునే దిశ కూడా మార్చుకోవాలి. వెల్లకిలా పడుకుంటే గురక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పక్కకు తిరిగి పడుకోవడం వల్ల గురక రాకుండా ఉంటుంది. ఇలా మనం జాగ్రత్తలు పాటిస్తే గురకను దూరం చేసుకోవడం పెద్ద పనేమీ కాదు. కానీ దానికి తగిన పద్ధతులు పాటించి తీరాలి. లేదంటే గురక వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉంటాయి.
Also Read: Ketika Sharma: మెగా హీరోయిన్ అరాచకం… మిర్రర్ ముందు నిల్చొని ప్యాంటు బటన్స్ విప్పేసిన కేతిక