Snoring Problem: మనలో చాలా మందికి గురక అలవాటు ఉంటుంది. నిద్రలోకి జారుకున్నారంటే చాలు గురక శబ్దం వస్తుంది. దీంతో పక్కనున్న వారికి నిద్ర పట్టదు. లావుగా ఉన్నవారైనా సన్నంగా నాజూగ్గా ఉన్న వారికైనా గురక సామాన్యమే. పురుషులైనా స్త్రీలైనా గురక బారిన పడుతుంటారు. ముక్కుతోని శ్వాస తీసుకునే బదులు నోటితో తీసుకోవడం వల్ల గురక వస్తుంది.
ప్రాణాయామం
నోటితో కాకుండా ముక్కుతో గాలి తీసుకునేందుకు ప్రయత్నించాలి. ప్రాణాయామం చేయడం వల్ల ముక్కు సాఫీగా మారుతుంది. ముక్కుతో గాలి తీసుకుంటే గురక సమస్య ఉండదు. శ్వాస తీసుకునేందుకు సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం బాగా పనిచేస్తుంది. దీని వల్ల గురక సమస్యను కొంతవరకు అవకాశం వస్తుంది. అందుకే వీటిని కచ్చితంగా పాటిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది.
గుండెపోటు ముప్పు
ఆవునెయ్యిని వేడి చేసి ముక్కులలో వేసుకోవడం, అర చేతికి, కాళ్లకు మర్దన చేయడం మంచిది. కొంచెం వాము కషాయం తాగడం వల్ల కూడా గురక సమస్య దూరం అవుతుంది. గురక వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సైతం సూచిస్తున్నారు. గుండె జబ్బులకు మూలంగా గురక నిలుస్తుంది. అందుకే గురకే కదా అని నిర్లక్ష్యం చేస్తే నష్టాలు వస్తాయి.
గురక తగ్గించుకుంటేనే..
గురకను తగ్గించుకోవాలి. గురకను దూరం చేసుకోకపోతే తిప్పలు తప్పవు. అనారోగ్య సమస్యలకు మూలంగా నిలుస్తుంది. అందుకే గురకను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడమే మేలు. సులభతరమైన చిట్కాలు వాడుకుని గురక నుంచి దూరం కావాల్సిందే. లేదంటే జీవితంలో ఎన్నో సమస్యలకు మూలంగా నిలవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.